తమిళ ఇండస్ట్రీలో హిట్ పెయిర్ అంటే ముందుగా గుర్తుకు వచ్చే జంట దళపతి విజయ్-సమంత. వీరిద్దరూ కలిసి నటించిన తేరీ, మెర్సల్, కత్తి సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకున్న విషయం తెలిసింఏద. దీంతో ఈ జంట వెండితెరపై మరోసారి సందడి చేయాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో విజయ్ 69వ చిత్రంలో సమంత హీరోయిన్‌గా ఖరారైందని తమిళ ఫిల్మ్ సర్క్సిల్స్‌లో ప్రచారం జరుగుతున్నది. దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రానికి రంగం సిద్ధం చేసుకున్నాడనే విషయం తెలిసిందే. ఇక తన చివరి చిత్రంగా ‘విజయ్ 69’కు సన్నాహాలు చేస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతుంది.
ఇందులో విజయ్ యువ రాజకీయ నాయకుడిగా కనిపిస్తారని.. ఈ చిత్రంలో కథానాయికగా సమంత దాదాపు ఖరారైందని, త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాగా ప్రస్తుతం సమంత స్వీయ నిర్మాణ సంస్థలో ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నది. ఇక విజయ్ ‘గోట్’ అనే సినిమాలో నటిస్తున్నాడు.