ముక్తకంఠంతో ఎగ్జిట్ పోల్స్ ఘోష : చంద్రన్నకే కిరీటం!

తెలుగుమోపో డాట్ కామ్ ఎన్నికల పోలింగుకు ముందుగానే తమ అంచనాలను వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా పోలింగుకు రెండురోజుల ముందు వరకు ఉన్న పరిస్థితులను అధ్యయనం చేసి, మదింపు వేసి.. చంద్రబాబునాయుడు సారథ్యంలోని తెలుగుదేశంకూటమి భారీ మెజారిటీతో అధికారంలోకి రాబోతున్నదనే సంగతిని వెల్లడించింది. ఇంచుమించుగా 20 రోజుల తర్వాత చివరి విడత పోలింగ్ ముగిశాక.. ఎగ్జిట్ పోల్స్ వెల్లడవుతుండగా.. ఆనాడు telugumopo.com వెల్లడించిన విషయాలే వాస్తవరూపం దాలుస్తున్నట్టుగా అర్థమవుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసారి ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. పార్టీలో చావోరేవో అన్నట్టుగా తలపడ్డాయి. ఇరుపక్షాలు కూడా విజయం మీద చాలా ధీమా వ్యక్తం చేస్తూ వచ్చాయి. ఎవరి ధీమా ఎలా ఉన్నప్పటికీ.. ఓటరు తీర్పు ఈవీఎం లలో నిక్షిప్తం అయిపోయింది. చివరి విడత తరువాత.. వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ చాలా వరకు ఏపీలో కూటమి అధికారంలోకి వస్తుందనే విషయాన్ని ఖరారు చేస్తున్నాయి.
ఇక్కడ ఒక అంశాన్ని గమనించాల్సి ఉంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తెలుగుదేశం అధికారంలోకి వస్తుందనే అంచనాలు వెల్లడించిన ఆరు సంస్థల్లో అన్నీ ఏకగ్రీవంగా కూటమికి 100 కంటె ఎక్కువ స్థానాలు దక్కబోతున్నట్టుగా తేల్చి చెప్పాయి. అంటే ఈ ఆరుసంస్థలు చెప్పిన గణాంకాల ప్రకారం కూటమికి కనీసంగా 104, గరిష్టంగా 161 స్థానాలు దక్కే అవకాశం ఉ:ది. జనగళం సంస్థ 104 లెక్క మినిమంగా చెప్పగా, కేకే సర్వేస్ అనే సంస్థ 161 విజయాలను సూచించింది.
ఇదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి వస్తుందని అంచనాలను వెల్లడించిన మూడు సంస్థలు రెండు సంస్థలు ఆ పార్టీకి వందకంటె తక్కువ స్థానాలనే సూచించాయి. అంటే 94 సీట్లనుంచి కనిష్టంగా రావొచ్చునని అంచనా వేశాయి. అంటే ఆ సంస్థలు కూడా పోటీ గట్టిగా ఉంటుందని అంటున్నట్టే లెక్క.
ఈ పరిస్థితుల్లో చంద్రబాబునాయుడు అధికారంలోకి రావడం కన్ఫర్మ్ అని తేలిపోతోంది. ఎన్డీయే కూటమి పక్షాలు, పార్టీల కార్యకర్తలు, అభిమానులు అంతా ఆనందడోలికల్లో తేలియాడుతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories