పాన్ ఇండియా చిత్రంగా తెరమీదకు వచ్చిన ఆదిపురుష్ చిత్రం అనుకున్న అంచనాలను అందుకోలేకపోయింది. ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్ నటించగా, ఆయన పక్కన సీతగా బాలీవుడ్ భామ కృతి సనన్ నటించి మెప్పించింది. కృతి సనన్ కొద్ది రోజుల క్రితం నిర్మాతగా తన సెకండ్ కెరీర్ ను మొదలు పెట్టింది.ఓ పక్క హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే మరో పక్క ప్రొడ్యూసర్ గా బాధ్యతులు నిర్వర్తిస్తుంది.
బ్లూ బటర్ ఫ్లై ఫిలిమ్స్ అనే నిర్మాణ సంస్థ ను ఈ అమ్మాడు స్టార్ట్ చేసింది. ఈ ప్రొడక్షన్ నుంచి దో పత్తీ అనే సినిమా రూపుదిద్దుకుంటుంది.
దీనికి సంబంధించిన విషయాలు గురించి తాజాగా ఈ అమ్మడు ఈ సినిమాకు నిర్మాతగా తాను పడ్డ కష్టాల గురించి చెప్పుకొచ్చింది. నిర్మాతగా మొదటి సారి బాధ్యతలు నిర్వహిస్తుండడం వల్ల రోజులో కనీసం 16 నుంచి 17 గంటల వరకు కష్టపడి పని చేయాల్సి వచ్చేదని తెలిపింది.
ఈ సినిమాలో ఏ సీన్ ని అయినా సరే ఆరోజే పూర్తి చేయాలని భావించేదాన్ని.. అందుకోసం ఏకంగా తాను, తనతో పాటు మరికొంతమంది కూడా ఏకంగా 17 గంటలు కష్టపడే వారని తెలిపారు. నేను నిర్మాతగా మారతా అని చెప్పినప్పుడు చాలా మంది ఖర్చులు బాగా పెరిగిపోయాయని ఇప్పుడు ఇలాంటి ఆలోచన చేయడం కరెక్ట్ కాదు అని తెలిపారు.
నేను స్వయంగా సినిమా వారందరికీ ప్రతి రూపాయి ఖర్చు పెడుతుంటే కానీ తెలియలేదు పరిస్థితి మొత్తం అంటూ చెప్పుకొచ్చింది. దో పత్తీ సినిమాను శశాంకా చతుర్వేది తెరకెక్కిస్తున్నారు. మిస్టరీ థ్రిల్లర్ కథా నేపథ్యంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది.