ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నాయకుల్లో ఒకడు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు మాత్రమే కాదు కదా.. ఆయన తాత రాజారెడ్డి దగ్గరినుంచి వైఎస్ కుటుంబంతో ఎంతో ఆత్మీయంగా మెలగుతూ వచ్చే వ్యక్తి,. వైఎస్ రాజశేఖర రెడ్డికి కూడా చాలా సన్నిహితుడు. వైఎస్ఆర్ ద్వారా అనేక పదవులు, ప్రయోజనాలు పొందిన వ్యక్తి. ఆ దామాషాకు తగ్గట్టుగానే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటిదాకా కూడా ఆయన హవా సాగుతూనే వచ్చింది. కానీ.. ఐఏఎస్ అధికారి వై శ్రీలక్ష్మి విషయంలో ఆయన వ్యవహార సరళికి మాత్రం.. వైసీపీ కోటరీనుంచి ఎదురుదెబ్బ తగులుతోంది. మామూలుగా చంద్రబాబును, టీటీడీని విమర్శిస్తూ తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి మాట్లాడే ప్రతి మాటకు సాక్షిలో విపరీతమైన ప్రచారం దక్కుతుందనే సంగతి అందరికీ తెలుసు. కానీ.. ఆయన సుదీర్ఘమైన ఒక వీడియో విడుదల చేసి.. విచ్చలవిడిగా ఐఏఎస్ శ్రీలక్ష్మి అవినీతి గురించి ఆరోపణలు చేసినప్పటికీ.. సాక్షిలో ఆయన వీడియో గురించి ఒక్క ముక్క కూడా ప్రచురించలేదు. సాక్షి చానెల్ లో దానిని ప్రస్తావించను కూడా లేదు.
బహుశా భూమన కరుణాకర రెడ్డి ఒక అంశాన్ని లేవనెత్తి ఒకరిమీద దుమ్మెత్తిపోయడం, దానికి సాక్షిలో వీసమెత్తు కూడా ప్రచారం రాకపోవడం బహుశా ఇదే ప్రథమం అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఐఏఎస్ అధికార శ్రీలక్ష్మి.. తాను సర్వీసులో చేరిననాటినుంచి అవినీతికి ముద్రపడిన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఏయే ఊర్లలో ఏయే పదవుల్లో పనిచేసినప్పటికీ కూడా.. ప్రతిచోటా ఆమె తన అవినీతి దందాలను నడిపించారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉణ్న రోజుల్లో జగన్ సాగించిన దందాలన్నింటికీ తన వంతు సహకారం అందిస్తూ వచ్చారు. గాలి జనార్దనరెడ్డి అక్రమ మైనింగ్ వ్యవహారాలకు మద్దతిచ్చిన కేసుల్లో ఇంకా విచారణ ఎదుర్కొంటున్నారు. జగన్ సీఎం అయ్యాక ఏపీ సర్వీసుకు వెళ్లి.. ఎడాపెడా దోచుకున్నారు. ఆయనకు తోడ్పాటు అందించారు. శ్రీలక్ష్మి చేసిన దందాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి కూడా సంబంధం ఉన్నవే. ఆయన అనుమతితో, ఆయన వాటాలతో జరిగినవే అని ఎవర్ని అడిగినా చెబుతారు. అలాంటిది.. శ్రీలక్ష్మి మీద కక్షతో భూమన కరుణాకర రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. సూటిగా జగన్ ను ఇరుకునపెట్టేలా ఉన్నాయని, అందుచేతనే సాక్షి దినపత్రిక, టీవీ ఛానెల్ లలో వాటి గురించి కనీసం ప్రచారం కూడా ఇవ్వలేదని అంతా అనుకుంటున్నారు. కానీ.. సాక్షి కంటె విస్తృతంగా ఇతర చానెళ్లు అన్నీ కూడా భూమన వ్యాఖ్యలను, శ్రీలక్ష్మిపై విమర్శలను హైలైట్ చేయడం గమనార్హం.