కౌంటింగుపై వైఎస్సార్సీపీ ఏడుపులు షురూ!

ఎగ్జిట్ పోల్స్ ను బట్టి.. అభిప్రాయాలు ఏర్పాటుచేసుకునే వాళ్లు సామాన్యులైన ప్రజలు మాత్రమే. ఏపీ ఎన్నికల తరహాలో.. హోరాహోరీ జరిగిన చోట.. అధికారపార్టీ కి అనుకూలంగా కూడా 5 శాతం సంస్థలు ఫలితాలు వెల్లడించిన నేపథ్యంలో ప్రజలు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడబోతున్నదనే క్లారిటీతో ఉన్నారు. ఆ 5 శాతం ఎగ్జిట్ పోల్స్ చూసుకుని.. వైసీపీ వారు ఇంకా బీరాలు పలుకుతున్నారు. అయితే ఈ గణాంకాలు కావల్సింది కేవలం ప్రజలకే! పార్టీలు ఇంతకంటె పటిష్టమైన అంచనాలను తమకు తాము విడిగా సేకరించుకుని ఉంటాయి. ఓడిపోతాం అనే క్లారిటీ వైసీపీ నాయకులకు చాలా బలంగా ఉన్నట్టు అర్థమైపోతోంది. ఆ పార్టీ తరఫున.. జగన్ కు ప్రత్యమ్నాయంగా ప్రతి సందర్భంలోనూ మీడియాలో మాట్లాడుతూ ఉండే సజ్జల రామక్రిష్ణారెడ్డి.. ఇప్పటినుంచే కౌంటింగ్ మీద ఆరోపణలు చేయడం, నిందలు వేయడం ప్రారంభిస్తున్నారు.
కౌంటింగ్ పారదర్శకంగా నిజాయితీగా జరిగితేనే ఫలితాలు సక్రమంగా వస్తాయని సజ్జల రామక్రిష్ణారెడ్డి అంటున్నారు. అంటే మరో48 గంటల్లో ఖరారు కాబోతున్న ఓటమికి సంబంధించి ఇప్పటినుంచే ఆయన కారణాలు అన్వేషిస్తున్నట్టుగా కనిపిస్తోంది. రిజల్ట్స్ వచ్చిన తరువాత.. కౌంటింగ్ లో అక్రమాలు జరిగాయని, తాము సుప్రీం కోర్టుకు వెళ్లబోతున్నాం అని సజ్జల మరోమారు మీడియా ముందు అనే అవకాశం ఉంది. ఫలితాలు ప్రకటించకుండా ఆపుచేయాలని కోరుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులోనో, సుప్రీం కోర్టులోనో ఓ కామెడీ పిటిషన్ వేసినా ఆశ్చర్యం లేదు. పోస్టల్ బ్యాలెట్ల విషయంలోనే.. సీఈవో మీనా ఆదేశాలకు విరుద్ధంగా కోర్టుకు వెళ్లి భంగపడిన వైసీపీ, ఓడిపోయిన తర్వాత కూడా కోర్టు మాట ఎత్తవచ్చు.
ఓటమి తర్వాత నిందలు వేయడానికి, మేం తొలినుంచి చెబుతూనే ఉన్నాం.. అనడానికి వీలుగా.. సజ్జల రామక్రిష్ణారెడ్డి చాలా కాలంగా సీఈవో ముఖేష్ కుమార్ మీనా మీద ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఎన్డీయే కూటమితో కుమ్మక్కు అయి చంద్రబాబునాయుడు చెప్పినట్టు పనిచేస్తున్నారని నిందలు వేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆయన తాజా ప్రెస్ మీట్, ఎగ్జిట్ పోల్స్ గురించిన అభిప్రాయాలు గమనిస్తే.. కౌంటింగ్ జరిగిన తీరును నిందించి, తమను కుట్రపూరితలంగా ఓడించారని చెప్పుకోడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా ఉంది.

Related Posts

Comments

spot_img

Recent Stories