యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులన్నారన్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ నటనకు ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు ఆయన్ని ఆకాశానికి ఎత్తేస్తుంటారు.తారక్ ప్రస్తుతం డ్యాషింగ్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో దేవర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా చివరి దశ షూటింగ్ కు చేరుకుంది. దీనితో సమానంగానే ఎన్టీఆర్ “వార్ 2 ” మూవీలో కూడా నటిస్తున్నాడు.
వార్ 2 మూవీలో హృతిక్ రోషన్ ,ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న విషయం తెలిసిందే . ఈ సినిమాని యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోసం ఎన్టీఆర్ ముంబై వెళ్లారు. వార్ 2 తాజా షెడ్యూల్ లో ఎన్టీఆర్ పాల్గొన్నారు. అయితే నిన్న ముంబైలో ఎన్టీఆర్ తన భార్య ప్రణతితో కలిసి ఓ డిన్నర్ పార్టీలో పాల్గొన్నారు.
ఈ పార్టీకి రణ్ బీర్ కపూర్,అలియా భట్ ,కరణ్ జోహార్ వంటి బాలీవుడ్ సెలెబ్రెటీస్ హాజరు అయ్యారు.డిన్నర్ ముగించుకొని ఎన్టీఆర్ ,ప్రణతి బయటకు వస్తుండగా అభిమానులు సెల్ఫీస్ కోసం వచ్చారు. అయితే వారిలో ఓ అభిమాని ఎన్టీఆర్ ముందుకు వచ్చి సార్ ఇవాళ నా పుట్టినరోజు మీతో ఓ ఫొటో తీసుకోవచ్చా అని అడిగింది. దీనికి వెంటనే స్పందించిన ఎన్టీఆర్ చిరునవ్వుతో ఆమెను దగ్గరికి తీసుకుని ఆమెతో ఫొటో దిగి బర్త్డే విషెస్ తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో అభిమానులు తెగ సంతోషిస్తున్నారు.