టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ఇపుడు చేస్తున్న పలు చిత్రాలు కోసం అందరికీ తెలిసిందే. అలాగే తన లాస్ట్ భారీ హిట్ చిత్రం దేవర జపాన్ లో రిలీజ్ కోసం తారక్ అక్కడికి వెళ్లిన విషయం కూడా తెలిసిందే. మరి అక్కడ ఫుల్ స్వింగ్ లో ప్రమోషన్స్ చేసిన తారక్ తన అభిమానులకి తన లేటెస్ట్ లుక్స్ తో మాత్రం మంచి కిక్ అందిస్తున్నాడు అని చెప్పాలి.
అక్కడకి వెళ్లిన నాటి నుంచి మంచి స్టైలిష్ ఫోటో షూట్స్ చేస్తూ తన నుంచి వస్తున్న ఫోటోలు కొన్ని అభిమానులకి ఆనందాన్ని పంచుతున్నాయి. ఇక ఇలా లేటెస్ట్ గా మరికొన్ని స్టైలిష్ పిక్స్ వైరల్ గా మారాయి. బ్లాక్ నెక్ టీ షర్ట్ మరియు బ్లాక్ పాంట్ లో పైన తెల్లటి డెనిమ్ షర్ట్ లో మంచి డ్యాపర్ గా కూల్ లుక్స్ లో కనిపిస్తూ తారక్ అదరగొట్టేసాడని చెప్పాలి. దీనితో ఈ పిక్స్ నందమూరి అభిమానుల నడుమ వైరల్ గా చక్కర్లు కొడుతున్నాయి. ఇక తారక్ ఇపుడూ వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.