ఫుల్‌ స్వింగ్‌ లో యంగ్‌ హీరో!

టాలెంట్ ఉన్న యంగ్ హీరోల లో ఒకరైన శ్రీవిష్ణు, తనదైన స్టైల్ తో టాలీవుడ్ లో బిజీగా మారిపోతున్నాడు. ఇటీవలే విడుదలైన స్వాగ్ సినిమాలో మూడు విభిన్నమైన షేడ్స్ ని చాలా నాచురల్‌గా చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన మరో సినిమా సింగిల్ తో మళ్ళీ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయబోతున్నాడు.

ఇదే కాదు, వచ్చే రోజుల్లో మరిన్ని వేరొకరకమైన కాన్సెప్ట్‌లతో సినిమాలు చేయాలని షెడ్యూల్ చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగా, తన తదుపరి మూడో సినిమాలపై ఫోకస్ పెట్టిన శ్రీవిష్ణు, విభిన్నమైన కథలతో ముందుకెళ్లాలని చూస్తున్నాడు. వాటిలో మొదటిది మృత్యుంజయ అనే చిత్రం. ఇది ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ‘అమృతం’ సీరియల్‌కు దర్శకత్వం వహించిన గుణ్ణం గంగరాజు బేనర్‌ లో తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 30 రోజులు పూర్తయ్యిందట.

ఇంకో సినిమాగా, కుటుంబం మొత్తం కలిసి చూసేలా ఉండే ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని కూడా ప్లాన్ చేస్తున్నాడు. అంతేకాదు, అడవిని నేపథ్యంగా తీసుకున్న మరో చిత్రాన్ని కూడా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంచాడు. అంటే మొత్తం మూడు సినిమాలు పూర్తిగా వేరే వేరే జానర్స్‌లో ఉండబోతున్నాయన్న మాట.

ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతున్న సింగిల్ తో పాటు, ఈ మిగతా మూడు సినిమాలు వచ్చే ఏడాది వేసవిలో థియేటర్లలోకి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఓవర్ ఆల్‌గా చూస్తే శ్రీవిష్ణు ఇప్పుడు కెరీర్‌లో ఫుల్ స్పీడ్ మీద ఉన్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Related Posts

Comments

spot_img

Recent Stories