హీరో శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమ మురారి సినిమా చాలా రోజుల క్రితమే షూటింగ్ పూర్తయింది. కానీ ఇప్పటికీ రిలీజ్ డేట్ ప్రకటించకపోవడంతో ఈ ప్రాజెక్ట్‌పై సందేహాలు మొదలయ్యాయి. ముఖ్యంగా డిజిటల్ హక్కుల డీల్ ఫైనల్ కాకపోవడం వల్లే విడుదల వెనక్కి పడుతోందని టాక్ వినిపిస్తోంది.
సామజవరగమనా సినిమాతో పేరు తెచ్చుకున్న రామ్ అబ్బరాజు ఈ సినిమాను డైరెక్ట్ చేయడం వల్ల మొదటి నుంచే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఏర్పడింది. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం మేకర్స్ ఈ సినిమాను సంక్రాంతి సమయంలో థియేటర్లలోకి తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే వచ్చే సంక్రాంతికి ఇప్పటికే భారీగా సినిమాలు రేసులో ఉన్నాయి. చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు, నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు, ప్రభాస్ ది రాజా సాబ్, రవితేజ RT76తో పాటు రెండు తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి.