టాలీవుడ్ సొట్టబుగ్గల సుందరి తాప్సీ ఝుమ్మంది నాదం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. చాలా కాలం నుంచి ఈ ముద్దుగుమ్మ తన ప్రియుడ్ని సీక్రెట్ గా పెళ్లి చేసుకుందనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఎందుకంటే తాప్సీ గత పది సంవత్సరాలుగా డెన్మార్క్ కి చెందిన బ్యాడ్మింటన్ ఆటగాడుమథియాస్ బో తో ప్రేమలో ఉందనే విషయం తెలిసిందే.
మార్చి 23 న వీరి వివాహం జరిగిందని.. దానికి అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారని సమాచారం. ఉదయ్‌పూర్ లో తాప్సీ – మథియాస్ వివాహం జరిగినట్లు వినికిడి. అసలే క్లారిటీ లేదు అంటే.. ఈ వార్తలకు బలం చేకూరుస్తూ తాప్సీ బెస్ట్ ఫ్రెండ్.. ప్రొడ్యూసర్ కనిక కొన్ని ఫోటోలను షేర్ నా స్నేహితుల పెళ్లిలో అని రాసుకొచ్చింది.
ఈ ఫోటోలను చూసిన వారు కనిక ఆ పెళ్లికి వెళ్లారంటూ…గుసగుసలాడుకుంటున్నారు. అంతేకాకుండా ఈ పెళ్లి వేడుకకు అనురాగ్ కశ్యప్ కూడా వెళ్లినట్లు సమాచారం. దీంతో ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో తాప్సీనే స్వయంగా వీటి గురించి స్పందించారు.
పెళ్లి అనేది అందరి జీవితాల్లో చాలా ముఖ్యమైన భాగం… దాని గురించి నేనేం దాచాలనుకోవడం లేదు. సరైన సమయం రాగానే నేనే మీ అందరికీ స్వయంగా తెలియజేస్తాను అంటూ వివరించింది.