డైనమిక్ లుక్ లో అదిరిపోయావ్ బాస్! టాలీవుడ్ లో ఉన్నటువంటి బిగ్గెస్ట్ స్టార్ హీరోస్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకరు. అయితే రామ్ చరణ్ స్టైలింగ్ కి కానీ తన హెయిర్ స్టైల్ కి కానీ సినీ ప్రముఖుల్లోనే సెపరేట్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అయితే రామ్ చరణ్ ఇపుడు దర్శకుడు బుచ్చిబాబు సానాతో తన కెరీర్ 16వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా కోసం చరణ్ ఒక సాలిడ్ లుక్ ని కూడా ప్రిపేర్ చేయగా ఈ మధ్య కాలంలో పలు ఫోటోలు కూడా వైరల్ గా మారాయి.
ఇక లేటెస్ట్ గా గ్లోబల్ స్టార్ ముంబైలో ల్యాండ్ అయ్యిన విజువల్స్ ఓ రేంజ్ లో వైరల్ గా మారాయి. మరి లేటెస్ట్ లుక్ లో చరణ్ వైట్ షర్ట్ లో మంచి డైనమిక్ గా స్టైలిష్ గా కూడా కనిపిస్తున్నాడు. దీనితో రామ్ చరణ్ కొత్త లుక్ మాత్రం ఫ్యాన్స్ కి సూపర్ గా కిక్ ఇస్తుంది. ఇక చరణ్ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే వృద్ధి సినిమాస్ మరియు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.