డైరెక్టర్ మారుతి టీమ్ నుంచి వచ్చిన బేబీ సినిమా ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో మరో సినిమా ప్రేక్షకులను అలరించేందుకు రానుంది. మారుతి టీమ్ ప్రొడక్ట్ – వానరా సెల్యూలాయిడ్ సంయుక్త నిర్మాణంలో రావు రమేష్ ప్రధాన పాత్రలో అంకిత్ కొయ్య, విశాఖ ధిమన్ కథానాయికలుగా బాల సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకుంటుంది.
ఎ.విజయ్ పాల్ రెడ్డి నిర్మాతగా ప్రకాష్ రౌతు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా తెరకెక్కుతున్న సినిమాకి “బ్యూటీ” అనే టైటిల్ ఖరారు చేశారు. . తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్లోని ఫిలింనగర్ దైవ సన్నిధానంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన స్టార్ దర్శకుడు మారుతి క్లాప్ కొట్టగా, మరో దర్శకుడు బుచ్చిబాబు సాన కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
ఈ కార్యక్రమంలో దర్శకులు వీరశంకర్, సుబ్బు మంగాదేవి, డార్లింగ్ స్వామి తదితరులు పాల్గొని టీంకి తమ శుభాకాంక్షలు తెలిపారు. ఇక లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న బ్యూటీ సినిమా మే రెండు నుండి హైదరాబాద్ పరిసర పాంతాల్లో షూటింగ్ జరుపుకోనుందని అంటున్నారు.