ఒకప్పుడు సినిమా థియేటర్స్ లో విడుదలైన తర్వాత ఓటీటీలోకి రావడానికి కనీసం రెండు మూడు వారాల గ్యాప్ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. తాజాగా రీల్‌లో నిన్నే వచ్చిన సినిమా, రియల్‌లో ఓటీటీలోకి వచ్చేసింది. అథర్వ ప్రధాన పాత్రలో నటించిన తమిళ థ్రిల్లర్ “డీఎన్‌ఏ” తాజాగా తెలుగులో “మై బేబీ” పేరుతో విడుదలైంది. ఇది జూలై 18న థియేటర్లలోకి వచ్చిన తర్వాత తక్కువ సమయంలోనే డిజిటల్ ప్లాట్‌ఫారంలోకి వచ్చేసింది.
హాట్‌స్టార్ ఈ సినిమాని తమ ఓటీటీ ప్లాట్‌ఫారంలో విడుదల చేసింది. ఇందులో ఒరిజినల్ తమిళ్ వెర్షన్‌తో పాటు తెలుగు డబ్బింగ్‌తో కూడిన వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. అంతేకాదు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్‌కి వచ్చింది. థియేటర్‌లో చూసే ఛాన్స్ మిస్ అయినవాళ్లు ఇంట్లోనే బాగస్వామ్యంగా ఈ థ్రిల్లర్‌ని ఆస్వాదించవచ్చు.
ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహించిన నెల్సన్ వెంకటేశన్ తనకు ప్రత్యేకమైన కథానాయకునిగా గుర్తింపు తెచ్చుకున్న అథర్వను ప్రధాన పాత్రలో చూపించగా, తెలుగు ప్రేక్షకుల కోసం సురేష్ కొండేటి విడుదల చేశారు. ఓ మిస్టరీ, ఎమోషన్ మేళవించిన కథనంతో కూడిన ఈ సినిమా ఇప్పుడు హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది. మీరు థ్రిల్లర్ సినిమాల అభిమానులైతే ఓసారి చూసి తీరాల్సిందే.