గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన 16వ సినిమాగా “పెద్ది” అనే భారీ చిత్రాన్ని ప్రస్తుతం చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే సుకుమార్ దర్శకత్వంలో తన 17వ ప్రాజెక్ట్ కోసం కూడా చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే అతని లైనప్ లో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ కూడా ఉండబోతుందనే టాక్ ఒక సమయంలో బలంగా వినిపించింది. ఆ సినిమాపై మొదట్లో మంచి ఆసక్తి కూడా ఏర్పడింది.
అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. అప్పటి నుంచి ఆ కాంబో వెనక్కి పడిపోయింది. గౌతమ్ తర్వాత విజయ్ దేవరకొండతో “కింగ్డమ్” అనే సినిమా ప్రకటించగానే, ఇదే కథ రామ్ చరణ్ కు ముందుగా చెప్పాడని ఓ టాక్ వెలుగులోకి వచ్చింది. దీని వల్ల ఇద్దరు స్టార్స్ అభిమానుల్లో క్లారిటీ లేకుండా గందరగోళం నెలకొంది.
ఇప్పుడు ఈ టాపిక్‌పై స్పష్టత ఇచ్చారు “కింగ్డమ్” చిత్ర నిర్మాత. గౌతమ్ తిన్ననూరి రామ్ చరణ్ కు చెప్పిన కథ పూర్తిగా వేరని, ప్రస్తుతం తెరకెక్కిస్తున్న “కింగ్డమ్”కి ఆ కథకు సంబంధం లేదని తెలిపారు. చరణ్ ప్రాజెక్ట్ పూర్తిగా క్లోజ్ అయ్యిందని, కింగ్‌డమ్ మూడో పంథాలో సాగుతోందని స్పష్టం చేశారు.
అంటే చెప్పాలంటే, గౌతమ్ చరణ్ ప్రాజెక్ట్ ఒక దశలో ఆగిపోయిందనీ, ప్రస్తుతం విజయ్ తో చేస్తున్న “కింగ్డమ్” పూర్తిగా కొత్త కథతో సాగుతోందనీ స్పష్టమవుతుంది. ఇది రెండు వేర్వేరు సినిమాలని ఇక స్పష్టంగా చెప్పొచ్చు.