అమరావతి అప్పులపై వైసీపీ విషప్రచారాలు!

రాజధాని అమరావతి నిర్మాణానికి రాష్ట్రప్రభుత్వం విస్తృతంగానే అప్పులు చేస్తోంది. ఇందులో ఎలాంటి దాపరికం లేదు. అయితే ఈ అప్పులను బూచిగా చూపిస్తూ.. రాష్ట్రానికి పెద్ద ద్రోహం జరిగిపోతున్నట్టుగా.. వైఎస్సార్ సీపీ దళాలు విషప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఒకవైపు అమరావతి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన ఘనంగా జరిగిన నేపథ్యంలో చూసి ఓర్వలేకపోతున్నవారు. చంద్రబాబునాయుడు అప్పులు తెచ్చి.. విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తున్నారని.. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలను పణంగా పెడుతున్నారని కపటప్రేమను చూపిస్తున్నారు. ఈ విషయంలో పూర్తి అబద్ధాలను ప్రచారం చేయడం ద్వారా.. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో దురభిప్రాయం కలిగించాలని చూస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సారథిగా పనిచేసి.. గతంలో మంత్రిగా కూడా చేసి, ఎమ్మెల్యే ఎన్నికల్లో కనీసం నాలుగువేల ఓట్లు కూడా సాధించలేకపోయిన సాకే శైలజానాధ్ ఇప్పుడు వైసీపీలో తనకు నియోజవర్గ ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చేసరికి మరింతగా రెచ్చిపోతున్నారు. ఏమాత్రం లాజిక్ లేని విమర్శలతో కూటమి ప్రభుత్వం మీద బురద చల్లుతూ ఉంటే.. జగన్ గుడ్ లుక్స్ లో పడవచ్చునని ఆయన తలపోస్తున్నట్టుగా ఉంది.
శైలాజానాధ్ మాట్లాడుతూ.. అప్పులన్నీ తెచ్చి అమరావతిలో పెట్టడం తగదని, ఇది ఖచ్చితంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని, ఉత్తరాంధ్ర రాయలసీమలను పణణంగా పెట్టడమేనని మొసలి కన్నీరు కారుస్తున్నారు. అప్పుల విషయంలో ఒక్క శాతం కూడా నిజం లేని విషపు వాదనలను ఆయన ఫ్యాబ్రికేట్ చేస్తున్నారు. అప్పులన్నీ తెచ్చి అమరావతిలో పెడుతున్నారని ఆయన అనడం కరెక్టు కాదు. అమరావతి కోసం మాత్రమే అప్పులు తెస్తున్నారు. ఆ డబ్బులను అమరావతిలో నిర్దిష్టమైన పనులకు మాత్రమే ఖర్చు పెడుతున్నారు.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో ఎలా ఉండేదంటే.. రకరకాల కార్పొరేషన్లు ఏర్పాటుచేసి.. ఆయా కులాల అభ్యున్నతి కోసం అంటూ కార్పొరేషన్ ల పేర్ల మీద వందల కోట్ల అప్పులు తెచ్చారు. అక్కడ కార్యక్రమాలేమీ చేయకుండా, ఆ డబ్బులన్నింటినీ సంక్షేమ పథకాల పేరుతో దారి మళ్లించేవారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సొమ్ములను కూడా దారి మళ్లించి ఖర్చు పెట్టిన ఘోరమైన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. అలాంటి పార్టీ నాయకులు శైలాజానాధ్.. అప్పుల విషయంలో పూర్తి పారదర్శకంగా ఉన్న చంద్రబాబు ప్రభుత్వంపై నింద వేయడం కామెడీగా ఉంది.

అమరావతి అనేది సెల్ఫ్ సస్టయినబుల్ ప్రాజెక్టు అని.. నిర్మాణాలు పూర్తయిన తర్వాత.. ప్రభుత్వం వద్ద మిగిలి ఉండే స్థలాలను వేలంలో విక్రయించడం ద్వారా వచ్చే సొమ్ముతో అప్పులు తీరుస్తాం అని ప్రభుత్వం చాలా స్పష్టంగా చెబుతోంది. అంటే అమరావతి కోసం చేస్తున్న అప్పులన్నీ కూడా ఆ నగర నిర్మాణం పూర్తయ్యేలోగా ఆటోమేటిగ్గా తీరుతాయి. ఆ అప్పుల భారం.. రాష్ట్రప్రభుత్వంపై ఇంకో రకంగా పడే అవకాశమే లేదు. రాష్ట్రప్రభుత్వ ఆదాయ వనరుల ద్వారా వచ్చే సొమ్మును.. అమరావతికోసం చేసిన అప్పులు తీర్చడానికి వినియోగించే అవసరమే లేదు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు మాత్రం అబద్ధాలతో కూడిన తమ తప్పుడు ప్రచారాలతో, విషప్రచారాలతో రెచ్చిపోతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories