అమరావతిపై వైసీపీ కుటిలత్వం.. అవసరమా జగన్!

అమరావతి రాజధానిపై ఉన్న కక్ష, దుర్బుద్ధి బయటపడితే.. 2019 ఎన్నికల్లో తేడా కొడుతుందని ప్రజలు ఛీ కొడతారని భయపడి తాడేపల్లిలో ఒక ఇల్లు కట్టుకుని, ‘అమరావతి రాజధానికి జగన్ జై కొట్టినట్టే కదా’ అని తన వందిమాగధులతో అనిపించుకుని ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినవ్యక్తి జగన్. అధికారంలోకి వచ్చిన వెంటనే.. అమరావతిలో కూల్చివేతలు, విధ్వంసంతోనే తన పరిపాలన ప్రారంభించిన వ్యక్తి ఆయన. మూడురాజధానుల కాన్సెప్టుతో అమరావతి రాజధాని నిర్మాణాలను ఎక్కడివక్కడ ఆపేసి.. 55 వేల ఎకరాల రైతుల త్యాగాలను శ్మశానంలాగా మార్చేయడానికి ఆయన పరితపించారు. ప్రజలు దారుణంగా ఛీకొట్టి ఓడించిన తర్వాత, కూటమి ప్రభుత్వం అమరావతి పనులను వేగంగా చేపడుతుండగా.. ఒక అద్భుత రాజధానిగా తీర్చిదిద్దే ప్రయత్నాల్లో ఉండగా.. ఇప్పటికీ తనకు అలవాటైన కుటిలత్వాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రదర్శిస్తున్నదనే విమర్శలు బాగా వినిపిస్తున్నాయి. అమరావతి రాజధాని నిర్మాణ ప్రాజెక్టులకు అప్పులు ఇవ్వదలచుకున్న బ్యాంకులకు తప్పుడు వివరాలతో లేఖలు రాయిస్తూ, మెయిల్స్ పెట్టిస్తూ.. అప్పులు రాకుండా చేయడానికి జగన్ దళాలు కుట్రలు చేస్తున్నాయని వెలుగులోకి వస్తోంది. ప్రపంచ బ్యాంకుకు ఇలాంటి మెయిల్స్ అనేకం అందంగా.. వాటన్నింటినీ బుట్టదాఖలు చేసి మరీ.. ప్రపంచ బ్యాంకు అమరావతి నిర్మాణాలకు రుణం ఏర్పాటుచేస్తుండడం గమనార్హం.

ఒక పార్టీ అనుకూలురైన వ్యక్తులు అమరావతి నిర్మాణాలపై, నగర నిర్మాణంవల్ల జరిగే పర్యవసానాలపై పంపిన మెయిల్స్ అంతా బూటకం అని తేల్చినట్టుగా ప్రపంచబ్యాంకు బృందం ఏపీ ప్రభుత్వానికి సమాచారం పంపినట్లుగా తెలుస్తోంది. అమరావతి నగరానికి సంబంధించి.. అందిన పితూరీలకు భిన్నంగా అన్నీ సవ్యంగా ఉన్నట్టు తేలడంతో.. ప్రపంచబ్యాంకు ఏడీబీ కలిపి మొదటి విడత రుణం విడుదలచేశాయి కూడా. వీటికి కేంద్రం వాటా కలిపి 4285 కోట్లు విడుద లయఅ్యాయి. కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభించిన తర్వాత.. ప్రపంచబ్యాంకు+ఏడీబీ కలిపి 15 వేల కోట్ల రూపాయల రుణం ఏర్పాటు చేస్తున్నాయి. ఓర్వలేకపోయిన వైసీపీ నాయకత్వం 2024 డిసెంబరు 17న ప్రపంచబ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ కు ఫిర్యాదు పంపినట్టుగా తెలుస్తోంది. దేశ విదేశాల నుంచి అనేక పేర్లతో మెయిల్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది.
రాజధాని భూ సమీకరణ వల్ల రైతులు, కూలీల ఉపాధి పోతుందని జీవనోపాధులు దెబ్బతిన్నాయని అందులో ఫిర్యాదు చేశారు. పర్యావరణంపై ప్రభావం పడుతుందని కల్పనలు జోడించారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా.. ప్రపంచ బ్యాంకు రుణం కోసం ప్రయత్నిస్తుండగా.. ఇలాంటి ఫిర్యాదులనే  పంపింది వైసీపీ. ఆ లేఖలపై ప్రపంచ బ్యాంకు ఒక ఇన్‌స్పెక్షన్ ప్యానెల్ ఏర్పాటుచేసింది.ఆ ప్యానెల్ రెండు దఫాలుగా పర్యటించింది. వారి వద్దకు వైసీపీ నాయకులు వెళ్లి.. అమరావతికి వ్యతిరేకంగా ప్రభావితం చేయడానికి ప్రయత్నించారు. వారి కుటిలత్వం ఫలితమివ్వలేదు. కుట్రలు వీగిపోయాయి. భూములు స్వచ్ఛందంగానే రైతులు ఇచ్చారని, ఉల్లంఘనలు లేవని నిర్ధరణకు వచ్చిన తరువాత.. ప్రపంచ బ్యాంకు ఫిర్యాదుల్ని పక్నన పడేసి రుణం విడుదల చేసింది. ఇప్పడు వైసీపీ కుటిలనీతి, కుట్రలు అన్నీ బయటకు వచ్చి ఆ పార్టీ, మరియు అధినేత జగన్మోహన్ రెడ్డి భ్రష్టు పట్టిపోతున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories