కోర్టుకు వెళ్లడాన్ని కామెడీగా మారుస్తున్న వైసీపీ!

చట్టపరంగా అన్యాయం జరుగుతున్నదని బలంగా నమ్మినప్పుడు మాత్రమే న్యాయపీఠం తలుపు తట్టాలి. తమకు న్యాయం కావాలని అభ్యర్థించాలి. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చీటికి మాటికీ.. అయినదానికీ కానిదానికీ కోర్టు తలుపు తట్టడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. పోనీ వీళ్లేమయినా ప్రజల కోసం, ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించడం కోసం కోర్టుకు వెళుతున్నారా అంటే అది కూడా లేదు. కేవలం సంకుచిత ప్రయోజనాల కోసం, జగన్మోహన్ రెడ్డి స్వార్థం కోసం మాత్రమే ప్రతిసారీ కోర్టుకు వెళుతూ పలుచన అవుతున్నారు. వాళ్లకు కోర్టుకు వెళ్లాలనే ముచ్చట తప్ప దావా వేయడంలో తాము చేసే ఫిర్యాదులు అన్నీ పద్ధతిగా ఉండేలా చూసుకోవాలనే కోరిక కూడా ఉండడం లేదు. తప్పులు తడకలుగా ప్రభుత్వం మీద కోర్టులో కేసు వేసేసి, జడ్జి మందలించిన తర్వాత.. సరిదిద్దుకుని మళ్లీ పిటిషన్ వేస్తామని చెప్పే స్థాయికి వైసీపీ నేతలు దిగజారుతున్నారు.

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో తాడేపల్లి లోని తన  ప్యాలెస్ ను క్యాంపు కార్యాలయంగా ప్రకటించుకుని కోట్ల రూపాయల ఫర్నిచర్ ను అక్కడ ఏర్పాటు చేయించుకున్నారు. అధికారం తనకు శాశ్వతం అనుకున్న జగన్ ఇంటికి కంచె వేయించుకోవడం కోసమే 12 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టిన వైనం కూడా ప్రజలకు తెలుసు. అలాంటిది కోట్లరూపాయల ఫర్నిచర్ ను వేయించుకున్నారు. అయితే ప్రజలు దారుణంగా ఓడించడంతో ఆయన ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది.

తన ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఫర్నిచర్ ను వెంటనే తిరిగి  ఇవ్వనందుకు కోడెల శివప్రసాద్ ను ఏ రకంగా పొట్టన పెట్టుకున్నారో జగన్ కు గుర్తుంది గనుక.. ప్రభుత్వం తనను వదలిపెట్టదని భావించి.. తన ఇంట్లో, పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్  తిరిగి తీసుకువెళ్లాల్సిందిగా ప్రభుత్వానికి లేఖరాశారు. అందులో తాము సెలక్టు చేసిన కొంత ఫర్నిచర్ విలువ కడితే ఆ డబ్బు చెల్లించేస్తాం అని కూడా లేఖరాశారు. ప్రభుత్వం దాని మీద ఇంకా రిప్లయి ఇవ్వలేదు.

ఇంతలోనే- ఈ విషయం మీద కూడా వారు కోర్టుకు వెళ్లారు. ఫర్నిచర్ విషయంలో జీఏడీ నుంచి రిప్లయి రాలేదని కోర్టులో లేళ్ల అప్పిరెడ్డి పిటిషన్ వేశారు. పిటిషన్లో ఫర్నిచర్ వివరాలు అన్నింటినీ తప్పులు తడకలుగా నమోదు చేశారు. అసలు ఈ పిటిషన్ ను ఎలా అనుమతించారని జడ్జి ఆగ్రహించడంతో.. వైసీపీ న్యాయవాది.. సవరించి మళ్లీ పిటిషన్ వేస్తాం అంటూ వెనక్కు తగ్గారు. కేసులు కోర్టులో వేయాలనే కోరిక తప్ప సరిగ్గా వేయాలనే ఆలోచనే జగన్మోహన్ రెడ్డి దళాలకు లేదని ప్రజలు అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories