నిస్తేజంగా వైసీపీ.. జోరు మీదున్న టీడీపీ!

ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో రాష్ట్రంలో ఉన్న రెండు ప్రధాన పార్టీలలో పరస్పర విరుద్ధమైన, పూర్తి భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఒక వైపు అధికార ఎన్డీయే కూటమిలోని తెలుగుదేశం అభ్యర్థులను ప్రకటించి.. వారి విజయం కోసం కార్యకర్తల సమావేశాలు కూడా నిర్వహిస్తూ.. వారికి స్ఫూర్తి ఇవ్వడానికి ప్రయత్నిస్తుండగా.. అదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కనీసం ఎన్నికలకు సంబంధించిన కనీస కసరత్తు కూడా కనిపించడం లేదు. ఆ పార్టీ మొత్తం జగన్ ఆస్తుల గొడవ గురించి మాట్లాడుకోవడంతోనే సరిపోతోంది.

ప్రస్తుతం రాష్ట్రంలో రెండు పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. కృష్ణా-గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్ర స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయి. ఈ రెండు స్థానాలకు ఆలపాటి రాజేంద్రప్రసాద్, పేరాబత్తుల రాజశేఖర్ లను అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీ ప్రకటించింది.ఇప్పుడు వీరిని గెలిపించుకోవడానికి సంబంధించిన కసరత్తును పార్టీ ప్రారంభించింది. గత ఎన్నికల్లో కూటమిలోని మూడు పార్టీలను సరిగ్గా సమన్వయం చేసుకోవడం వల్లనే.. 93 శాతం సీట్లు సాధించాం అని చంద్రబాబునాయుడు తన పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఇప్పుడు కూడా అదే రీతిగా తెలుగుదేశం నాయకులు జనసేన, బిజెపి నాయకులతో కూడా స్థానికంగా సమన్వయం చేసుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు సీట్లను కూడా మంచి మెజారిటీతో దక్కించుకోవాలని అంటున్నారు.

ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నవంబరు 6వ తేదీన ఓటర్ల నమోదు కార్యక్రమం పూర్తవుతుంది. తెలుగుదేశం ప్రభుత్వం ఈ అయిదేళ్లు పదవీకాలంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన అనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నదనే వాస్తవాన్ని యువతరానికి  తెలియజెబుతూ.. డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరినీ కూడా ఓటరుగా నమోదు చేయించేలా పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని చంద్రబాబునాయుడు వారికి సూచిస్తున్నారు. ప్రభుత్వం మంచిగా పనిచేస్తూ సరైన సేవలు అందించడం ఎంత ముఖ్యమూ, తాము చేస్తున్న పని గురించి ప్రజల్లోకి ప్రచారం చేసుకోవడం కూడా అంతే ముఖ్యమని చంద్రబాబు అంటున్నారు. తమ ప్రభుత్వ పథకాలు, నాలుగునెలల్లో తీసుకున్న నిర్ణయాలు, పాలసీలు అన్నింటిగురించి ప్రజల్లో చర్చ జరిగేలా చూస్తే తమ పార్టీ పట్ల ప్రజాదరణ అదే పెరుగుతుందని ఆయన సూచిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories