గాజు గ్లాసు దక్కిన వారికి వైసీపీ ఫైనాన్సింగ్!

జనసేన పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా కేటాయించిన ఎన్నికల కమిషన్.. అదే గుర్తును ఫ్రీ సింబల్ గా అందుబాటులో పెట్టి ఇప్పుడు చాలా పెద్ద గందరగోళానికి తెరతీసింది. జనసేన పోటీచేస్తున్న 21 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు.. రాష్ట్రంలో ఇప్పడు చాలా చాలా నియోజకవర్గాల్లో ఎవరో ఒక ఇండిపెండెంటు అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తు దక్కింది. పవన్ కల్యాణ్ రాష్ట్రమంతా కొన్నేళ్లుగా తిరిగి పనిచేస్తూ.. గాజు గ్లాసు గుర్తుకు చేసిన ప్రచారం.. ఇప్పుడు అప్పనంగా ఆ ఇండిపెండెంటు అభ్యర్థులకు లాభించనుంది. వారికి డబుల్ బోనాంజాగా మరో అదృష్టం ఏంటంటే.. నియోజకవర్గాల్లో గాజు గ్లాసు గుర్తు పొందిన ఇండిపెండెంట్లు అందరికీ వైసీపీ నాయకులు చాటుమాటుగా ఫైనాన్స్ చేయడానికి ఆఫర్ ఇస్తున్నారట!

నియోజకవర్గాల్లో గాజు గ్లాసు గుర్తు పొందిన వారిలో చాలామంది తెలుగుదేశం, జనసేన రెబెల్ అభ్యర్థులు ఉన్నారు. వారితో పాటు సరదాగా మాత్రమే ఇండిపెండెంటుగా పోటీచేసే అభ్యర్థులు చాలా మంది ఉంటారు. అలాంటిది.. ఇప్పుడు వారికి గాజు గ్లాసు గుర్తు వచ్చింది. ఈ గుర్తు ఉన్న వారు ప్రచారానికి పెద్దగా ఖర్చు చేస్తారనే నమ్మకమేమీ లేదు. అయితే వారికి పడే ఓట్లు మాత్రం.. కూటమి అభ్యర్థులకు నష్టం చేస్తాయి. గ్లాసుకు పడే ఓట్లలో 99 శాతం ఓట్లు తాము పవన్ కల్యాణ్ పార్టీకి ఓటు వేస్తున్నాం అనే భ్రమలో ఓటు వేసే అవకాశం ఉంది. ఈ ఒక్క గాజు గ్లాసు టోటల్ ఎన్నికల ఫలితాలను తారుమారుచేసే అవకాశం ఉంది.

సరిగ్గా ఈ పాయింటునే వైసీపీ నాయకులు పట్టుకున్నారు. గాజు గ్లాసు వారితో విస్తృతంగా ప్రచారం చేయిస్తే.. ఆ పార్టీకి పొరబాటుగా పడే ఓట్లన్నీ కూడా తెలుగుదేశం, భాజపా అభ్యర్థులు కోల్పోతారని అందువల్ల.. వైసీపీ కి చాలా పెద్ద ఎడ్వాంటేజీ వస్తుందని వారు మురిసిపోతున్నారు. అందుకే గ్లాసు పొందిన ఇండిపెండెంట్లకు కోటి రూపాయల వరకు అయినా సరే.. చాటుమాటుగా నిధులు ఏర్పాటుచేసి.. ఎన్డీయే కూటమిని దెబ్బకొట్టడానికి వ్యూహరచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఇక్కట్లను కూటమి అభ్యర్థులు ఎలా అధిగమిస్తారో చూడాలి. 

Related Posts

Comments

spot_img

Recent Stories