పోసానిని పీకల్దాకా ఇరికిస్తున్న వైసీపీ ఛానెల్!

పోసాని కృష్ణ మురళిని చూస్తే ప్రజలకు అయ్యోపాపం అనిపిస్తోంది. జగన్ కళ్లలో ఆనందం చూడడానికి ఎలా పడితే అలా మాట్లాడుతూ, విచ్చలవిడి బూతు పోస్టులు పెడుతూ సంచలనం సృష్టించారు పోసాని. అందుకు ప్రతిఫలం అన్నట్టుగా పదవిని కూడా పుచ్చుకున్నారు.. అనుభవించారు. ఇప్పుడు అరెస్టు అయి ఊరూరా జైళ్లకు తిరుగుతున్నారు. తాజాగా అసభ్య పోస్టుల విషయంలో గుంటూరు సీఐడీ పోలీసులు ఆయనను కస్టడీకి తీసుకుని విచారించడం జరిగింది. ఈ విచారణలో.. సాక్షి మీడియా వారే తన ప్రెస్ మీట్లకు అవసరమైన సమాచారం, మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు ఇచ్చేవారని, వాటి ఆధారంగానే తాను ప్రెస్ మీట్లు పెట్టానని పోసాని చెప్పినట్టుగా కొన్ని మీడియా సంస్థల్లో వచ్చింది. అదే సమయంలో.. వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన చానెల్ మాత్రం భిన్నమైన ప్రచారం చేస్తోంది.

సీఐడీ విచారణలో పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు పోసాని తడుముకోకుండా సమాధానాలు చెప్పారని వారు కొనియాడారు. అయితే.. సీఐడీ పోలీసులు అడిగిన ప్రశ్నలు- వాటికి పోసాని చెప్పిన సమాధానాలు అంటూ వారు వరుసగా వినిపించారు. వాటిని జాగ్రత్తగా గమనిస్తే.. అవన్నీ నిజంగా పోసాని సీఐడీ వారికి చెప్పిన సమాధానాలన్నది నిజమే అయితే గనుక.. ఆయన ఇంకా లోతుగా కేసులో కూరుకుపోతారేమోనని ప్రజలు అనుకుంటున్నారు.

ఆ చానెల్ లో ప్రసారమైన కొన్ని ఉదాహరణలు చూద్దాం..
ప్రశ్న: మోడీకి భార్యేలేదు.. అన్ని చంద్రబాబు అన్నట్టుగా చెప్పారు కదా.. మీకెలా తెలుసు.
పోసాని : ఆయన అలా అనడం టీవీలో చూశాను .. చెప్పాను.
ప్రశ్న: మోడీ ఎవడు? అమిత్ షా ఎవడు? వాళ్లను నేనే గెలిపించాను అని చంద్రబాబు అన్నట్టుగా చెప్పారు కదా? మీకెలా తెలుసు.
పోసాని : ఆయన అలా అనడం టీవీలో చూశాను .. చెప్పాను.
.. అన్ని రకాల వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి సీఐడీ వారి ప్రశ్నలు, పోసాని స్టీరియో టైపు సమాధానాలు ఇదేవిధంగా సాగిపోయాయని ఆ చానెల్ ప్రసారం చేసింది.
అయితే ఇలాంటి సమాధానాలతో లీగల్ గా గట్టున పడడం కష్టం. చంద్రబాబు అలా మాట్లాడినట్టుగా ఏదో టీ అంగళ్ల దగ్గర, కిళ్లీ బంకుల దగ్గర చర్చల్లో చెప్పుకోడానికి ఓకే.. కానీ బాధ్యతగల వ్యక్తిగా ప్రెస్ మీట్ పెట్టి మీడియా మముందు మాట్లాడుతున్నారంటే.. వాటి ఆధారాలు కూడా తన వద్ద ఉంచుకోవాలి. మోడీ భార్య గురించి గానీ, ఆ ఇద్దరిని గెలిపించడం గురించి గానీ.. చంద్రబాబు ఎప్పుడు చెప్పినట్టుగా ఆయన ఏ టీవీలో చూశారో, ఆ టీవీ క్లిప్పింగులను కూడా తనవద్ద ఉంచుకోవాలి.. అవేమీ లేకుండా ఏదో నోరున్నది కదాని, ప్రెస్ మీట్ గల స్టేటస్ ఏదోకరూపంలో ఉన్నది కదాని.. అందరినీ పిలిచి అవాకులు చెవాకులు పేలితే కుదరదు. ఆ చానెల్ ప్రసారం అయినదంతా నిజమే అయితే గనుక.. ఇలాంటి జవాబులు చెప్పినందుకు పోసాని ఆధారాలు చూపాల్సి ఉంటుంది. ఆధరాల్లేకుండా మాట్లాడినట్టు తేలితే.. శిక్షకు సిద్ధం కావాల్సి ఉంటుందని ప్రజలు అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories