పిఠాపురం మంటల వెనుక వైసీపీ!

తెలుగుదేశం పార్టీలో ఇది అనూహ్యమైన పరిణామం. అసంతృప్తులు రేగడం వింత కాదు.. కానీ అవి మంటల రూపంలో చెలరేగడం అనేది మాత్రం అనూహ్యం.పిఠాపురంలో అలాంటి పరిణామం జరగడం ఇవాళ తెలుగుదేశం వర్గాలందరినీ విస్మయానికి గురిచేసింది. పిఠాపురం  నియోజకవర్గం నుంచి తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించిన వెంటనే,  అక్కడ అసంతృప్తి జ్వాలలు రేగాయి.  తెలుగుదేశం పార్టీ తరఫున గత ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన వర్మ అనుచరులు చిన్నపాటి విధ్వంసం సృష్టించారు. తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలను బ్యానర్లను తగులపెట్టారు.  ఈ పరిణామాలపై చంద్రబాబు నాయుడు కూడా,  అక్కడి పార్టీ ఇన్చార్జి వర్మకు ఫోన్ చేసి..  క్రమశిక్షణ గల పార్టీ కార్యకర్తలు ఎవరు ఇలాంటి చర్యలకు దిగరని అనడం గమనార్హం.

 అయితే విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి వర్మ అనుచరులు సృష్టించిన విధ్వంసం వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రేరణ ఉన్నదని అనుకుంటున్నారు.  జగన్ వర్గీయుల ప్రోద్బలంతోనే వర్మ అనుచరులు రెచ్చిపోయారనేది పార్టీలో వినిపిస్తోంది.  వర్మ ఇండిపెండెంట్గా అయినా పోటీ చేయాలని  ఆయన అనుచరులు అంటున్నారు.  అదే సమయంలో పవన్ కళ్యాణ్ ను ఓడించడం అనేది తమ అతిపెద్ద లక్ష్యాలలో ఒకటిగా పరిగణించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ..  వర్మకు ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చి,  తమ పార్టీలో చేర్చుకుంటుందనే ప్రచారం కూడా స్థానికంగా వినిపిస్తోంది.

వై నాట్  175 అనే నినాదంతో,  కుప్పంలో చంద్రబాబును కూడా ఓడించాలని అంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్,  అక్కడ అనేక రకాల ఎత్తుగడలను అనుసరిస్తున్న సంగతి తెలిసిందే.  చంద్రబాబును ఓడించడం కంటే ప్రధానంగా,  పవన్ కళ్యాణ్ మీద వారు కాన్సెంట్రేట్ చేస్తున్నారు.  ఇన్నాళ్లు ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారనేది బయటకు రాకపోవడం వలన మిన్నకున్నారు. ఇప్పుడు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు తెలియగానే అక్కడ తెలుగుదేశంలో వ్యతిరేకతను ఎగదోస్తున్నారని తెలుస్తోంది. 

చంద్రబాబు నాయుడు వర్మ కు ఫోన్ చేసి బుజ్జగించడానికి చేసిన ప్రయత్నాలు ఏమేరకు ఫలించాయి అనేది తెలియడం లేదు.  గతంలో ఒకసారి ఇండిపెండెంట్గా కూడా గెలిచినా అనుభవం ఉన్న వర్మను,  అనుకూలంగా మార్చుకో లేకపోతే ఇబ్బంది తప్పకపోవచ్చు.  ఆ నమ్మకంతోనే ఆయనను రకరకాలుగా ప్రలోభ పెట్టి తెలుగుదేశానికి వ్యతిరేకంగా పనిచేసేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతున్నదని సమాచారం.  ఆ నియోజకవర్గంలో వైసిపి తరఫున ఇప్పటికే వంగా గీతను ఇన్చార్జిగా ప్రకటించారు.  ఆమె మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తాను పవన్ కళ్యాణ్ ను ఓడించి తీరుతానని డాంబికంగా చెబుతున్నారు.   ఆమె ధీమాపై వైసీపీ అధిష్టానం కు నమ్మకం లేకపోయినప్పటికీ.. తెలుగుదేశంలో మంటలు రాజేయడం ద్వారా గెలవాలని అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories