టాక్సిక్‌ కోసం అలా మారిన యష్‌!

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా “టాక్సిక్” మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కేజీఎఫ్ సిరీస్ తర్వాత ఆయన నుంచి ఏ సినిమా వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూసే సమయంలో ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించడంతో అభిమానుల్లో హైప్ పెరిగింది.

ఈ చిత్రంపై యష్ చాలా శ్రద్ధ చూపుతున్నారని ఇండస్ట్రీ టాక్. కేవలం నటుడిగానే కాకుండా, సినిమాకు సంబంధించిన ప్రతీ చిన్న విషయాన్ని కూడా ఆయన పర్సనల్‌గా చూసుకుంటున్నారని సమాచారం. అందుకే ఆయన ఈ ప్రాజెక్ట్‌లో డైరెక్షన్‌కి కూడా హస్తక్షేపం చేస్తున్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి.

అసలు విషయానికి వస్తే, ఈ సినిమాకు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కానీ కొన్ని ముఖ్యమైన సన్నివేశాల్లో యష్ తన ఐడియాలతో పాలుపంచుకుని డైరెక్ట్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్స్ ఎంతవరకు నిజమో క్లారిటీ రావాల్సి ఉంది.

అయితే భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాను వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ స్పీడ్‌గా సాగుతుండగా, వచ్చే ఏడాది మార్చి 19న గ్రాండ్ రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories