వావ్ ..తారక్! మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ చిత్రం దేవర సక్సెస్ తర్వాత తన నుంచి రానున్న తదుపరి సినిమాలపై మరిన్ని అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాల్లో బాలీవుడ్ సెన్సేషనల్ సీక్వెల్ చిత్రం “వార్ 2” కూడా ఒకటి.
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ నటించిన వార్ కి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాలో తారక్ సాలిడ్ రోల్ లో హృతిక్ తో సమానంగా కనిపించనున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ లో ఎప్పటికపుడు పాల్గొంటున్న తారక్ ఈ సినిమా కోసం మంచి స్టైలిష్ లుక్ ని కూడా ప్రిపేర్ చేసిన సంగతి తెలిసిందే.
ఇలా లేటెస్ట్ గా తన లుక్స్ కొన్ని సోషల్ మీడియాలో మంచి వైరల్ గా మారాయి. బృందావనం సినిమా టైం లో ఎన్టీఆర్ ఎలా కనిపించాడో మళ్ళీ ఆ తరహా లుక్స్ తో మంచి ఫ్రెష్ అండ్ కూల్ గా కనిపిస్తున్నాడు. దీనితో పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.