ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ కు మహిళా ఓటర్లు వెల్లువలా వస్తున్నారు. దాదాపుగా ప్రతి నియోజకవర్గం వద్ద.. మహిళల క్యూలైన్లు చాలా పెద్దవిగా ఉంటున్నాయి. ఉదయం ఓటింగు ప్రారంభం అయ్యే సమయానికే చాలా పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ బూత్ ల వద్దకు చేరుకున్నారు. పగటివేళ ఎండలు చాలా ఎక్కువగా ఉండడంతో ఓటర్లు ఉదయమే పోలింగుకు వచ్చినట్టుగా కనిపిస్తోంది. వచ్చినవారిలోనూ మహిళా ఓటర్ల సంఖ్య అత్యధికంగా ఉండడం విశేషం. మహిళా వెల్లువ ఎక్కువగా ఉండడం అనేది చంద్రబాబునాయుడు కు నీరాజనం పట్టడమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబునాయుడు ప్రకటించిన పథకాలు ఏ ఒక్కటి మిస్ చేసుకున్నా.. ఏపీలోని మహిళాలోకం చాలా కోల్పోయినట్టే అనే భావన యావత్తుమహిళల్లో వచ్చింది. అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఇంటినుంచి బయటకు కదలివచ్చి.. చంద్రబాబునాయుడుకు నీరాజనం పట్టడానికే తరలుతున్నట్టుగా కనిపిస్తున్నారు.
చంద్రబాబునాయుడు తన సూపర్ సిక్స్ హామీలలో గానీ.. మేనిఫెస్టోలో గానీ మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశారు. అనూహ్యమైన రీతిలో పథకాలను ప్రకటించారు. రాష్ట్రంలోని 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500, ప్రతి గృహిణికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి అనేక పథకాలు చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఉన్నాయి. వాటిని కౌంటర్ చేయలేని స్థితిలో చేతులెత్తేసిన జగన్.. చంద్రబాబును నమ్మొద్దు అనడం తప్ప మరేమీ చేయలేకపోయారు. కానీ జగన్ కంఠశోషను ఎవ్వరూ పట్టించుకోలేదు. మహిళలు వెల్లువలా వచ్చి ఓట్లేస్తున్నారు.
జగన్ ప్రకటించిన పథకాల్లో మహిళల కోసం కొత్తగా ఏ ఒక్కటీ లేకపోవడం గమనార్హం. మహిళలైనా, వృద్ధులైనా, ఎవ్వరైనా కావొచ్చు గాక.. నేను ఇప్పటికే చాలా చేసేశాను.. ఇక చేయడానికి ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవు.. ఏమీ చేయలేను అనే మాటలు మాత్రమే జగన్ చెబుతూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ప్రకటనలతో జనం విసిగిపోయిన వాతావరణం స్పష్టంగా ఓటింగ్ సరళిలో కనిపిస్తోంది.
మహిళల కోసం అనేక కొత్త పథకాలు ప్రకటించి తన కమిట్ మెంట్ ఏమిటో నిరూపించుకున్న చంద్రబాబునాయుడుకు తమ ఓటు ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకోవడానికే మహిళలు ఇంతగా వెల్లువెత్తిన వస్తున్నట్టుగా ప్రజలు భావిస్తున్నారు.