వెంకీ మామ కోసం టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ తో..!

టాలీవుడ్ ప్రేక్షకులందరికీ సుపరిచితమైన విక్టరీ వెంకటేష్ ఇటీవలే విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ సినిమా హిట్ తర్వాత వెంకీ మామ ఇప్పుడు మళ్లీ చాలా కాలం తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కొత్త సినిమాకు సిద్ధమవుతున్నారు. ఈ కాంబినేషన్ వస్తుందనే వార్త ఒక్కటే అభిమానుల్లో భారీ ఆసక్తిని రేపుతోంది.

ఇక ఈ ప్రాజెక్ట్ గురించి తాజాగా వినిపిస్తున్న సమాచారం మరింత హైప్‌ని పెంచేస్తోంది. త్రివిక్రమ్ ఈసారి తనకు ఎప్పటిలా దేవిశ్రీ ప్రసాద్ లేదా థమన్‌ని కాకుండా, కొత్త మ్యూజిక్ డైరెక్టర్‌తో పని చేయబోతున్నారట. ఈ అవకాశాన్ని పొందింది యువ సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ అని సమాచారం.

అర్జున్ రెడ్డి, అనిమల్ వంటి సినిమాలతో తన ప్రత్యేకమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ సెన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన హర్షవర్ధన్ రామేశ్వర్, ఇప్పుడు త్రివిక్రమ్-వెంకటేష్ ల కాంబినేషన్ కోసం ఎలా సౌండ్ అందిస్తాడన్నదే ఇప్పుడు అందరి కుతూహలం. త్రివిక్రమ్ స్టైల్‌కి తగ్గట్లుగా, వెంకీ మామ ఇమేజ్‌కి తగ్గ మ్యూజిక్ అందించగలడా అనే విషయంపై ఫిల్మ్ సర్కిల్స్‌లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories