పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారీ ప్రాజెక్ట్‌గా నిలుస్తోంది. షూటింగ్ పూర్తయినా, కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం విడుదలలో ఆలస్యం జరుగుతోంది. మొదట ఇది జూన్ చివర్లో థియేటర్లకు రానుందన్న వార్తలు వినిపించాయి. అయితే అదే సమయంలో మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన కన్నప్ప అనే పాన్ ఇండియా సినిమా జూన్ చివరిలో రిలీజ్ కావడంతో, రెండు పెద్ద సినిమాలు ఒకేసారి రావడం వల్ల కలిగే ప్రభావాన్ని నివారించేందుకు వీరమల్లు టీమ్ తాము వెనక్కి తగ్గాలని నిర్ణయించినట్టు సమాచారం.
తదుపరి విడుదల తేదీగా జూలైపై దృష్టి పెట్టిన మేకర్స్, మొదట జులై 4న అనుకున్నారు. కానీ ఆ తేదీన పవన్ కళ్యాణ్ టైటిల్‌తో నితిన్ నటించిన తమ్ముడు విడుదల కావడం, అలాగే జులై 11న అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఘాటి రిలీజ్ కావడం వల్ల చివరికి జూలై 18ను ఫైనల్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఆ తేదీన ఇతర పెద్ద సినిమాలు లేనందున, ప్రేక్షకుల దృష్టిని పూర్తిగా వీరమల్లుపైకి తీసుకురావచ్చని భావిస్తున్నారు.
ఇక ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసే సమయంలోనే జులై 18 విడుదల తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశముందని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా నిధి అగర్వాల్ నటించగా, సంగీత దర్శకుడిగా ఎం.ఎం. కీరవాణి పని చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాపై పవన్ అభిమానుల్లోనే కాక, సినిమా ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలున్నాయి. ఇప్పుడు మిగిలింది రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ మాత్రమే.