మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా సినిమా ‘మాస్ జాతర’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను డైరెక్టర్ భాను బోగవరపు డైరెక్ట్ చేస్తుండగా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ మూవీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతుంది. ఇక ఈ సినిమాను వేసవి కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుంది.
అయితే, ఈ చిత్ర షూటింగ్లో గాయపడ్డ రవితేజ ప్రస్తుతం బ్రేక్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఆయన తన తరువాత సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. టాలీవుడ్లో క్రేజీ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ మూవీగా వస్తున్న ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రాన్ని కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఓ పవర్ఫుల్ మాస్ ఎంటర్టైనర్ కథను రెడీ చేస్తున్నాడట ఈ డైరెక్టర్.
ఈ క్రమంలో మాస్ రాజా రవితేజకు తన కథను వినిపించిన కళ్యాణ్ శంకర్‌కు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ పూర్తవగానే రవితేజతో సినిమాను లాంచ్ చేసేందుకు కళ్యాణ్ శంకర్ ప్లాన్ చేస్తున్నాడట. మరి ఈ సినిమాలో రవితేజ పాత్ర ఉండనుందా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ విడుదల కావాల్సి ఉంది.