ఆయన డైరెక్షన్‌ లో రానా..సెట్‌ అవుతుందా!

‘హను-మాన్’ మూవీతో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు యంగ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్ వర్మ. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ తన తరువాత చిత్రాన్ని ఎప్పుడెప్పుడు తెరకెక్కిస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రశాంత్ వర్మ నందమూరి మోక్షజ్ఞతో తన నెక్స్ట్ మూవీని ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే, ఇప్పుడు కొన్ని కారణాల వల్ల ఈ మూవీ ఆలస్యం అవుతూ వస్తోంది. కాగా, ప్రశాంత్ వర్మ గతంలో బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌తో కలిసి ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ మూవీకి ‘బ్రహ్మరాక్షస్’ అనే టైటిల్‌ను కూడా ఆయన ఖరారు చేశారు. కానీ ఆ మూవీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.

అయితే, ఇప్పుడు ఈ సినిమాలో హీరోగా టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో హీరో పాత్ర చాలా అద్భుతంగా ఉండబోతుందని చిత్ర వర్గాల్లో టాక్ అయితే నడుస్తుంది. మరి నిజంగానే ఈ సినిమాలో రానా దగ్గుబాటి నటిస్తున్నాడా అనే దాని కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories