నితిన్‌ సినిమా నిలబడుతుందా!

నితిన్‌ సినిమా నిలబడుతుందా! జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్, సంగీత్ శోభన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్ స్క్వేర్’. ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాను ఈనెల 28న రిలీజ్ చేస్తామని నిర్మాత నాగవంశీ ప్రకటించారు. 29న రిలీజ్ చేయాల్సి ఉండగా, ఆరోజు అమావాస్య ఉండడంతో డిస్ట్రిబ్యూటర్లు ఒక రోజు ముందుగా రిలీజ్ చేయమని కోరారట. అందుకే, ఈ సినిమాని ఈనెల 28న రిలీజ్ చేయబోతున్నారు. అన్నట్టు అదే రోజు రిలీజ్ అవుతున్న నితిన్ ‘రాబిన్‌హుడ్’ మూవీకి పోటీగా ‘మ్యాడ్ స్క్వేర్’ రాబోతుంది. మరి ‘రాబిన్‌హుడ్’ ముందు ‘మ్యాడ్ స్క్వేర్’ ఏ రేంజ్ లో నిలబడుతుందో చూడాలి. మొత్తమ్మీద ఈ సినిమాతో మరోసారి నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ తమ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన యూఎస్ రైట్స్‌ను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ వి సినిమాస్ సొంతం చేసుకుంది. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories