లిక్కర్ పాపంలోకి కొత్త నిందితులు జత చేరుతారా?

మూడున్నర వేల రూపాయల ప్రజాధనాన్ని అడ్డగోలుగా జగన్ దళాలు స్వాహా చేసిన వ్యవహారంలో రోజురోజుకూ కొత్త సంగతులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. చీమలపుట్టి పిగిలినట్టుగా కొత్త కొత్త సంగతులు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో సిట్ పోలీసులు కోర్టు ఎదుట రెండు చార్జిషీట్లు దాఖలు చేశారు. ప్రధాన లబ్ధిదారు సంగతికి సంబంధించి చార్జిషీటులో ఇంకా స్పష్టంగా పేర్కొనలేదు. పిలిచి విచారించనూ లేదు. అయితే.. ఒక్కొక్కరి విచారణలో అనుబంధ విషయాలు బయటకు రావడం జరుగుతోంది. ఒక్కొక్క వాస్తవం తెలుస్తున్న కొద్దీ.. కొత్తగా కొందరి పాత్ర బయటకువస్తోంది. ఇప్పటికే 42 మంది నిందితులు ఉన్న ఈ కేసులో మరికొంత మంది నిందితుల పేర్లు కూడా జతకావొచ్చునని తెలుస్తోంది.

ఏపీ మద్యం కుంభకోణం విషయంలో సిట్ పోలీసులు కొత్తగా కొందరు వైసీపీ నాయకుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. వైసీపీ తరఫున గత ఎన్నికల్లో చిత్తూరు నుంచి పోటీచేసిన విజయానందరెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. రెండు రోజుల కిందట ఆయనను విజయవాడకు పిలిపించి అధికారులు మాట్లాడారు. విజయానందరెడ్డి ఇంటి అడ్రసుతోనే సీబీఆర్ ఇన్‌ఫ్రా కంపెనీ రిజిస్టరు అయి ఉండడం, ఆ కంపెనీకి మద్యం కుంభకోణంలో పాత్ర ఉన్నట్టుగా తేలినందువల్ల.. ఇప్పుడు చిత్తూరులో ఆయనకు చెందిన నివాసాలు అన్నింటిలోనూ దర్యాప్తు సాగించారు.

కోర్టు మందలించిన తర్వాత.. మీడియా ఎదుట రంకెలు వేయనని హామీ ఇచ్చిన వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర రెడ్డి పాత్ర గురించి కూడా ఇంకా లోతైన దర్యాప్తు జరుగుతూనే ఉంది. చెవిరెడ్డికి సంబంధించిన తిరుపతిలోని రియల్ ఎస్టేట్ కార్యాలయంలోనూ, తిరుపతి రూరల్ మండలంలోని ఇంట్లోనూ, హైదరాబాదులోనూ కూడా సిట్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఈ తనిఖీలను గమనిస్తే.. లిక్కర్ పాపంలోకి కొత్త నిందితులు కూడా జత చేరుతారా? అనే అనుమానాలు పలువురికి కలుగుతున్నాయి. ఇప్పటికే 42 మంది నిందితులు ఉన్నారు. ఈ నిందితులను ప్రధానంగా నాలుగు కేటగిరీలుగా విభజించవచ్చు. ఒకటి- అసలు లిక్కర్ కుంభకోణానికి సూత్రధారులు, పాలసీ రూపకర్తలు, మాస్టర్ బ్రెయిన్ లుగా పనిచేసిన వారు, రెండు- పాలసీని ప్లాన్ ను అమల్లో పెడుతూ డిస్టిలరీలను బెదిరించి వారి నుంచి నగదు వసూళ్లను చేసిన వారు, మూడు- నగదును భారీ మొత్తాల్లో తరలించి అంతిమలబ్ధిదారు జగన్ కు, ఆయన చెప్పిన డంప్ లకు చేరవేసిన వారు, నాలుగు- డంప్ లలోని సొమ్ములను జగన్ చెప్పిన ఖర్చులు, ఎన్నికల అవసరాలకోసం తరలించిన వారు. ఇలా నాలుగు రకాలకు చెందిన నిందితులు ఉన్నారు. ఒకటి, మూడు కేటగిరీల్లో మొత్తం అందరి పేర్లు ఇప్పటికే బయటకు వచ్చాయి గానీ.. రెండు, నాలుగు కేటగిరీల్లో ఇంకా కొత్త పేర్లు జతకలిసే అవకాశం ఉన్నదని పలువురు అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories