ఆమెను ఎప్పటికీ మరచిపోలేను: బోనీ కపూర్‌!

బాలీవుడ్‌ తాజా సినిమా మైదాన్ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఆ సినిమా నిర్మాత బోనీ కపూర్‌ మీడియాకి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో తన భార్య శ్రీదేవిని ఎప్పటికీ మరచిపోలేను అంటూ ఆయన కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… శ్రీదేవిని నేను ప్రతిరోజూ, ప్రతి నిమిషం మిస్‌ అవుతూనే ఉన్నాను అంటూ బోనీ చేసి వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌ గా మారాయి.

ఈ క్రమంలోనే శ్రీదేవి నటించిన ఇంగ్లీష్‌ వింగ్లీష్‌ సినిమా గురించి బోనీ కామెంట్స్‌ చేశారు. ముందు ఆ సినిమాని ఐశ్వర్య రాయ్‌ తో చేయాలనుకున్నారు. కానీ సినిమా నిర్మాత బాల్కీ శ్రీదేవిని ఎంచుకున్నారు. ఈ సందర్భంగా బోనీ బాల్కీతో మాట్లాడుతూ.. ఈ కథకు శ్రీదేవి కంటే బాగా న్యాయం చేసేవాళ్లు ఎవరూ లేరని ఆయనతో చెప్పారట. అందుకే ఆ సినిమాని ఆయన శ్రీదేవితో తీశారని బోని వివరించారు.

ఇక జాన్వీ- శిఖర్‌ పహారియా స్నేహం గురించి బోనీ ప్రస్తావిస్తూ శిఖర్‌.. జాన్వీతో పాటు మా అందరితోనూ స్నేహంగా ఉంటాడు. మాతో ఇలాంటి వ్యక్తి ఉన్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం… అని బోనీ చెప్పుకొచ్చాడు.

Related Posts

Comments

spot_img

Recent Stories