పిల్లల కోసం పెళ్లి చేసుకుంటాను: మెగా డాటర్!

కొణిదెల నిహారిక మెగా కుటుంబం నుంచి హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చిన ఏకైక వారసురాలు. కానీ హీరోయిన్‌ గా ఆమె కి పెద్దగా కలిసి రాలేదు. దాంతో సినిమాల్లో హీరోయిన్‌ గా మానేసి నిర్మాతగా కొనసాగుతుంది. సినిమాలు పెద్దగా కలిసి రాకపోవడంతో పెళ్లి చేసుకుంది. కానీ ఆ పెళ్లి ఎంతో కాలం నిలవలేదు. దీంతో ఇద్దరు విడాకులు తీసుకుని విడివిడిగా ఉంటున్నారు.

ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మ మళ్లీ మరోసారి సినిమాల మీద ఫుల్‌ గా ఫోకస్‌ పెట్టింది. ఈ క్రమంలోనే ఈ మధ్య కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తుంది. ఒకానొక సమయంలో అయితే తన విడాకులు గురించి చెబుతూ.. విడిపోతామని తెలిసి ఎవరూ పెళ్లి చేసుకోరు కదా అంటూ పేర్కొంది. అప్పుడు ఆమె అన్న మాటలు వైరల్‌ గా మారాయి.

తాజాగా మరోసారి నిహారిక తన రెండో పెళ్లి గురించి చెప్పుకొచ్చింది. అసలు విషయం ఏంటంటే..నిహారిక ఎక్కడికి వెళ్లినా తనని రెండో పెళ్లి ఎప్పుడూ చేసుకుంటున్నావు అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారంట. ఈ క్రమంలోనే ఆమె రెండో పెళ్లి చేసుకునేందుకు నేను సిద్దమే. కానీ అది ఎప్పుడూ అనేది మాత్రం నేను క్లారిటీ ఇవ్వను.

కానీ నాకు పిల్లలంటే చాలా ఇష్టం వారి కోసం నేను కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది. అయితే నిహారిక ఇలా ఈ వ్యాఖ్యలు చేసిందో లేదో ఆమె మాజీ భర్త చైతన్య జొన్నలగడ్డ తన ఇన్‌ స్టా లో ఓ పోస్ట్‌ పెట్టాడు. ‘‘విశాలమైన అంతరిక్షంలో నిశ్శబ్దం. నీటి అడుగున ఉన్నప్పుడు అనుభవించే నిశ్శబ్దం, జీవితం మిమ్మల్ని ముంచెత్తినప్పుడు మీ ఆలోచనలో మీరు కోరుకునే నిశ్శబ్దం. చల్లని శీతాకాలపు రాత్రి ఆవరించే నిశ్శబ్దం, మీ హృదయాన్ని బద్దలు కొట్టే విషయం విన్నప్పుడు వచ్చే నిశ్శబ్దం. మీ ప్రాణశక్తిని ప్రకృతి శక్తి నుండి వేరు చేస్తుంది. చప్పట్లు కొట్టే ముందు ప్రదర్శన ముగింపులో ఉండే నిశ్శబ్దం. భౌతిక రూపం నుంచి విముక్తి పొందండి. ఇదే మౌనం భగవంతుడితో కలిపే మాధ్యమం’ అంటూ  ఓ కవిత లాంటిది రాసుకొచ్చాడు.

ఈ కవిత ను చూసిన నెటిజన్లు మాజీ భార్యను మరిచిపోలేక, ఆమె రెండో పెళ్లి చేసుకుంటాను అంటే తట్టుకోలేక ఇలా రాసుకొచ్చాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories