సరస్వతి’ని జగన్ అమ్ముకునే పరిస్థితి కల్పిస్తారా?

మాచర్ల సమీపంలో ఏ భూములనైతే సుమారు ఇరవయ్యేళ్ల కిందట జగన్మోహన్ రెడ్డి సొంతం చేసుకున్నారో.. ఏ భూముల గురించిన అన్నాచెల్లెళ్ల మధ్య ఆస్తుల వివాదం తారస్థాయిలో నడుస్తున్నదో.. సదరు సరస్వతి పవర్ కంపెనీకి చెందిన మాచర్లర సమీపంలో  ఉండే భూములను డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరిశీలించారు. దాదాపు 1500 ఎకరాలకు పైగా భూములు సరస్వతీ పవర్ ఆధీనంలో ఉండగా.. అందులో సక్రమమెంత? అక్రమమెంత నిగ్గు తేల్చే పనిలో ఆయన పడ్డారు. ఆయన పర్యటనలో ఉన్న అధికారులు ఆ భూములు ప్రభుత్వ భూములు ఎన్ని. అటవీ భూములు ఎన్ని కూడా లెక్కలు చెప్పినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలను గమనిస్తూంటే.. ఈ సరస్వతీ పవర్ భూములను వెనక్కు రైతులకు ఇచ్చేయడం లేదా కంపెనీని వదులుకుని వెళ్లిపోయే పరిస్థితిని జగన్ కు ప్రభుత్వం కల్పిస్తుందా? అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి.

సరస్వతి పవర్ భూముల్లో 400 ఎకరాల దాకా అటవీ భూములు కూడా ఉన్నట్టు.. వాటిని అక్రమంగా రెవెన్యూ భూములుగా మార్చి కాజేసినట్టు తెలిసిందని పవన్ అన్నారు. ఈ ప్రకటనల పర్యవసానంగా ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. సరస్వతి పవర్ – సిమెంట్ కంపెనీగా మారాక.. వారికి సున్నపురాళ్ల తవ్వకాలకు అప్పటి వైఎస్సార్ ప్రభుత్వం 30 ఏళ్లకు లీజుకిచ్చింది. కంపెనీ పని ప్రారంభించలేదు. 2014లో చంద్రబాబు సర్కారు ఏర్పాడ్డాక ఆ లీజులు రద్దు చేశారు. 2019లో జగన్ వచ్చాక లీజు పునరుద్ధరిస్తూ అదనంగా మరో 50 ఏళ్లు లీజు ఇచ్చుకున్నారు. ఇప్పుడు పవన్ పర్యటన, పరిశీలన నేపథ్యంలో ఎటూ ఇప్పటిదాకా కార్యకలాపాలు మొదలు కాలేదు కాబట్టి.. మొత్తం లీజులు రద్దు చేసేస్తారని.. కొన్ని రోజుల్లో ఆదేశాలు వస్తాయని తెలుస్తోంది.

సున్నపురాళ్లు గనులు తవ్వుకునే లీజు గనుక లేకపోతే.. జగన్ కు సరస్వతి కంపెనీ నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాదు. లీజులు రద్దు చేస్తారు. సున్నపు రాళ్ల గనులు లేకపోయాక.. ఆ భూములు వల్ల జగన్ కు పెద్ద లాభం లేదు. కాబట్టి ఆయన వాటిని వదిలించుకోవచ్చు. రైతులకు తిరిగి ఇచ్చేయవచ్చు. అసలే రైతులు తిరిగివ్వాలని లేదా ఎకరాకు 18 లక్షలు కావాలని అడుగుతున్నారు. రైతులకు మద్దతుగా ప్రభుత్వం నిలుస్తే జగన్ కు ఇబ్బందే. కాబట్టి.. సరస్వతీ పవర్ ను జగన్ వద్దనుకునే పరిస్థితి ఏర్పడుతుందని పలువురు అంచనా వేస్తున్నారు.

ReplyForwardAdd reaction

Related Posts

Comments

spot_img

Recent Stories