తిరుపతి మేయర్ కోసం జగన్ తరలి వస్తారా?

రాష్ట్రంలో అనేక మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో అనేక వైస్ ఛైర్మన్ల పదవులకు జరిగిన ఉప ఎన్నికల పర్వం ముగిసింది.ఇంకా ఒకటిరెండు ఎన్నికలు మిగిలి ఉన్నాయి. ఇదిలా ఉండగా.. మునిసిపల్ ఛైర్మన్లు ఎన్నికై నాలుగేళ్లు పూర్తవుతున్న సందర్భంగా, వారి మీద అవిశ్వాస తీర్మానాలు పెట్టేందుకు అవసరమైన వెసులుబాటు ప్రతిపక్షాలకు చిక్కుతోంది. ఈ నేపథ్యంలో అనేక కొర్పారేషన్లలో ఛైర్మన్ గిరీ కూడా వైసీపీ చేజారే ప్రమాదం కనిపిస్తోంది. కాగా, తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు కిడ్నాపుల వాతావరణం మధ్య ఇటీవల తిరుపతి డిప్యూటీ మేయర్ స్థానాన్ని కోల్పోయిన వైసీపీ, అక్కడ ఛైర్మన్ పదవికి కూడా అవిశ్వాసం ప్రమాదం పొంచి ఉండడంతో ముందు జాగ్రత్త పడుతోంది. తిరుపతి కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని తమ పార్టీకోసం కాపాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి స్వయంగా తిరుపతి వచ్చి కార్పొరేటర్లతో సమావేశం అవుతారా? సాధ్యమేనా? అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.

తిరుపతిలో గతంలో ఎమ్మెల్యేగా చేసిన భూమన కరుణాకర రెడ్డి తాను పక్కకు తప్పుకుని, అప్పటిదాకా డిప్యూటీ మేయరుగా ఉన్న కొడుకు అభినయ రెడ్డిని ఎమ్మెల్యే బరిలో దించి భంగపడ్డారు. తీరా ఆ డిప్యూటీ మేయరు స్థానానికి ఇటీవల ఉప ఎన్నిక జరుగగా.. దానిని కూడా సుదీర్ఘమైన హైడ్రామా తర్వాత వైసీపీ కోల్పోయింది. కార్పొరేషన్ పాలకమండలి పదవీకాలం నాలుగేళ్లు పూర్తయినందున.. ఛైర్మన్ పదవిపై అవిశ్వాసం పెట్టడానికి అవకాశం ఏర్పడుతుంది. తిరుపతి మునిసిపాలిటీలో వైసీపీ తరఫున గెలిచిన అనేక మంది ఎమ్మెల్యేలు.. ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్న నేపథ్యంలో వైసీపీలో మళ్లీ వణుకు మొదలైంది. డిప్యూటీ ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా ఓటు వేసిన తెలుగుదేశంలో చేరిన కార్పొరేటర్లను భయభ్రాంతులకు గురిచేసిన భూమన కరుణాకరరెడ్డి, కొడుకు అభినయ్ రెడ్డి ఇప్పుడు కొత్త రాజకీయం చే్తున్నారు. త్యాగాలు చేసిఅయినా సరే.. మేయర్ స్థానాన్ని కాపాడుకుంటాం అని కరుణాకర్ రెడ్డి అంటున్నారు. అవసరమైతే జగన్ ను తిరుపతికి రప్పిస్తాం అని కూడా భూమన అంటున్నారు.

అయినా.. కార్పొరేటర్ల బలాబలాలు మారిపోయిన తర్వాత.. గెలిచే అవకాశం లేని మేయర్ సీటు కోసం అవిశ్వాసం పెడితే.. క్యాంపు రాజకీయాలు నడపడానికి జగన్ స్వయంగా తిరుపతికి వస్తారా? ఇది సాధ్యమేనా? అనే చర్చ సర్వత్రా నడుస్తోంది. జగన్ గెలిచి ముఖ్యమంత్రిగా ఉన్న అయిదేళ్లలో గానీ, ఓడిపోయిన తర్వాత 8 నెలల్లో గానీ తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రావడం అనేది చాలా అరుదు. తనకు అత్యంత మైలేజీ ఉంటుందని అనుకునే సందర్భాల్లో మాత్రమే జగన్ కోట దాటి బయటకు వస్తున్నారు. అలాంటిది.. తిరుపతిలో ఓడిపోయే మేయర్ సీటు కోసం జగన్ తిరుపతి దాకా వస్తారా? భూమన ఆ మేరకు జగన్ ను ప్రభావితం చేయగలరా? అనే చర్చలు పార్టీలో నడుస్తున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories