ఆశ గెలుస్తుందా భయం గెలుస్తుందా?

ప్రజలను ఏయే అంశాలు ప్రభావితం చేస్తాయి? ఓటింగ్ వేయడానికి వారు ఏ అంశాలను ప్రధానంగా ఎంచుకుంటారు? ఇలాంటి చర్చ అనేకసార్లు జరుగుతూనే ఉంటుంది. ప్రతి ఎన్నికల వేళలోనూ ఈ ప్రజల ప్రాధాన్యాలు అటు ఇటుగా మారుతూ ఉంటాయి. ఎందుకంటే అంత ఖచ్చితంగా ఫలానా అంశం మీద ఆధారపడి ప్రజలు ఓట్లు వేస్తారని తెలిస్తే.. రాజకీయ పార్టీలన్నీ కూడా ఆ ఒక్క అంశం మీదనే కాన్సెంట్రేట్ చేసి మిగిలిన అన్ని గాలికి వదిలేస్తాయి. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తూ ఉంటే అక్కడ ప్రధానంగా తలపడుతున్న తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలలో ఎవరు గెలుస్తారనేది.. ప్రజల్లోని ఆశ, భయం డిసైడ్ చేసేలా కనిపిస్తున్నాయి! చంద్రబాబు ప్రకటించిన హామీల పట్ల ప్రజలలో కలుగుతున్న ఆశ గెలిపిస్తుందా? లేదా, చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే అలవాటు లేని నాయకుడు అంటూ ప్రజలను భయపెట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్, జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నం గెలుస్తుందా అనేది చర్చనీయాంశంగా ఉంది !

సాధారణంగా ప్రజలను ఆకట్టుకోవడానికి రాజకీయ పార్టీలు మేనిఫెస్టో ప్రకటిస్తాయి. స్థూలంగా చూసినప్పుడు మేనిఫెస్టోలోని అంశాల ఆధారంగానే ప్రజలు ఓట్లు వేయాలి. మేనిఫెస్టోలో ఆయా పార్టీలు ఏఏ వర్గాల ప్రజలకు ఏ ఏ హామీలు ఇచ్చాయి అనేదాన్ని బట్టి వారి స్పందన ఉంటుంది. ఇది సహజంగా జరిగే సంగతి.
కానీ ఇప్పుడు ఏపీలోని వాతావరణాన్ని గమనిస్తే మ్యానిఫెస్టో పరంగా తెలుగుదేశం పార్టీ నూటికి  వెయ్యి శాతం అడ్వాంటేజీ పొజిషన్లో ఉంది. తెలుగుదేశం పార్టీ దాదాపుగా అన్ని వర్గాల ప్రజలకు కూడా అత్యంత ఆకర్షణీయమైన హామీలను ప్రకటించింది. ప్రధానంగా పింఛన్లను నాలుగువేలకు పెంచుతోంది. ఇవన్నీ కూడా వారికి చాలా పెద్ద అంశాలు. ఎంతగా వైసీపీ ఓటరు అయినప్పటికీ.. చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలు చూస్తోంటే ఎవ్వరికైనా సరే.. ఆశ పుట్టడం సహజం. అసలు ఓటర్లను ప్రభావితం చేస్తారనే భావన ఉన్న వాలంటీర్లలో కూడా చంద్రబాబు సీఎం కావాలనే ఆశ పుడుతోంది. వారి జీతాలు పదివేలు అవుతాయనే ఆశ వారిది. ప్రజలు, వాలంటీర్లు అందరూ చాలా ఆశగా చంద్రబాబు గెలవాలని కోరుకుంటున్నారు.

అయితే చంద్రబాబును ప్రజలు నమ్మరు. ఆయనకు హామీ నిలబెట్టుకునే అలవాటు లేదు.. అనే ఒకే ఒక్క ఆరోపణ ద్వారా ప్రజల్లో భయం పుట్టించి, ఆ భయాన్నే పెట్టుబడిగా పెట్టి తాము గెలవాలని వైసీపీ అనుకుంటోంది. అందుకే ఇప్పుడు ఏపీ ఎన్నికల్లో ఆశ గెలుస్తుందా? భయం గెలుస్తుందా? అనే చర్చ విస్తృతంగా సాగుతోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories