పవన్‌ కోసం తప్పుకుంటాడా?

పవన్‌ కోసం తప్పుకుంటాడా?! టాలీవుడ్‌లో పండుగ సీజన్‌లో సినిమాను విడుదల చేసి సక్సెస్ కొట్టాలని స్టార్ హీరోలు తెగ పోటీ పడుతుంటారు. అయితే, కొన్నిసార్లు తీవ్ర పోటీ ఉన్నా సినిమాలో కంటెంట్ బాగున్న సినిమాకే ప్రేక్షకులు తమ ఓటేసి పట్టం కడతారు. మరికొన్ని సార్లు బడా చిత్రాలకు దారిచ్చేందుకు కొందరు మీడియం, చిన్న హీరోల సినిమాల విడుదలను వాయిదా వేస్తుంటారు. అయితే, ఇప్పుడు టాలీవుడ్‌లో వచ్చే నెల నుండి పండుగ సీజన్ మొదలు కాబోతుంది. సంక్రాంతి, మహాశివరాత్రి, ఉగాది వరకు సాగే ఈ సీజన్‌లో పలు ఆసక్తికర చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాయి. కాగా, ఇప్పటికే సంక్రాంతి, మహాశివరాత్రికి విడుదల తేదీలను ఫిక్స్ చేసుకున్నాయి. అయితే, ఈసారి ఉగాది పండుగ మరింత ఆసక్తికరంగా మారనుంది. ఇప్పటికే ఉగాది సీజన్‌లో మార్చి 28 డేట్‌కు రెండు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు విడుదలకు సిద్దమయ్యాయి. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘హరిహర వీరమల్లు’.. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న VD12 సినిమాలున్నాయి. అయితే, ఈ రెండు సినిమాల్లో ఉగాది రేస్‌లో ఏ సినిమా విడుదల అవుతుందనే ఆసక్తి అందరిలో ఏర్పడింది. ఉగాది సీజన్‌ను క్యాష్ చేసుకోవడం ఒక్క సినిమాకు మాత్రమే సాధ్యం కానుండటంతో పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ అదే తేదీన వచ్చినట్లు అయితే.. విజయ్ దేవరకొండ మూవీ నిర్మాత నాగవంశీ తమ VD12 చిత్రాన్ని వాయిదా వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం. పవన్‌తో ఆయనకు ఉన్న మంచి బాండ్ కారణంగా తన సినిమా విడుదల తేదీని వాయిదా వేసుకోవడానికి ఆయన రెడీ అవుతారని వార్తలు వినపడుతున్నాయి. మరి నిజంగానే పవన్ కోసం విజయ్ దేవరకొండ తప్పుకుంటాడా లేడా.. అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. 

Related Posts

Comments

spot_img

Recent Stories