తెలుగు చిత్ర పరిశ్రమలో డ్యాషింగ్ డైరెక్టర్‌గా పూరీ జగన్నాధ్ తనదైన మార్క్ వేసుకున్నాడు. కొంత కాలం సినిమాలంటే పూరి సినిమాలే అన్నంత నడిచింది. పూరీ సినిమాలు వస్తున్నాయంటే, ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టేవారు. అయితే, గతకొంత కాలంగా పూరీ తెరకెక్కించిన సినిమాలు వరుసగా అపజయాలు అందుకుంటున్నాడు. దీంతో ఆయన నుంచి ఓ సాలిడ్ కమ్ బ్యాక్ మూవీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
అయితే, పూరీ గతంలో మెగాస్టార్ చిరంజీవి ల్యాండ్ మార్క్ మూవీ 150ని డైరెక్ట్ చేయాలని తీవ్ర ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. దీని కోసం ‘ఆటో జానీ’ మూవీ కథను కూడా సిద్దం చేశాడు. అయితే, చిరంజీవికి సెకండ్ హాఫ్ నచ్చకపోవడంతో అందులో మార్పులు చేయాలని చెప్పాడంట. ఇక చిరు తన 150వ చిత్రాన్ని దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు పూరీ ‘ఆటో జానీ’ కథలో మార్పులు చేసి తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం.
ప్రస్తుతం చిరు వరుసగా సినిమాలను అనౌన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పూరీ కూడా ఎలాగైనా చిరంజీవితో ‘ఆటో జానీ’ సినిమాని పట్టాలెక్కించాలని ప్రయత్నిస్తున్నాడట. చిరంజీవితో ‘ఆటో జానీ’ మూవీని తెరకెక్కించి సాలిడ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలని పూరీ అనుకుంటున్నాడంట.