వస్తాడా..రాడా!

టాలీవుడ్ హీరో నిఖిల్ ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాడు. ఆయన ప్రస్తుతం ‘స్వయంభూ’ అనే పీరియాడిక్ మైథలాజికల్ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు  భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నాడు. ‘కార్తికేయ-2’ తరువాత నిఖిల్ నుండి ఆ స్థాయిలో రాబోయే సినిమా ఇదే అని అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ మధ్యలో నిఖిల్ నటించిన మరో సినిమా విడుదలకు రెడీ అవడం అందరినీ షాక్‌ కి గురి చేసింది.

దర్శకుడు సుధీర్ వర్మ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అనే సినిమా నవంబర్ 8న విడుదలకు సిద్దంగా ఉంది.. ఈ సినిమాను కరోనా సమయంలో ప్రారంభించారు. అయితే, చాలా సార్లు వాయిదా పడి ఇప్పటికీ ఈ సినిమా ఎలాగోలా పూర్తి చేసుకుని విడుదలకు సిద్దం చేసింది చిత్ర బృందం. ఇక ‘స్వయంభూ’పై అంచనాలు భారీగా ఏర్పడుతున్న తరుణంలో ఇలా ఎప్పుడో ప్రారంభమైన సినిమా విడుదలకి రావడంతో నిఖిల్ కాస్త నిరాశకు లోనవుతున్నాడని వార్తలు కూడా వినపడుతున్నాయి.

ఈ సినిమా విడుదల దగ్గరపడుతుండటంతో ఇప్పుడు ఈ చిత్ర ప్రమోషన్స్‌కి నిఖిల్ వస్తాడా రాడా అనేది కూడా చాలా ఆసక్తిగా మారింది. ఇక ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్, రుక్మిణి వాసంత్ హీరోయిన్లుగా చేస్తున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాల్సిందే మరి.

Related Posts

Comments

spot_img

Recent Stories