డబ్బింగ్ సినిమాలకి కూడా ఎందుకు..?

టాలీవుడ్‌లో టికెట్ ధరలు పెంచే ట్రెండ్ ఒక్కసారిగా వచ్చినది కాదు. దాదాపు పదేళ్ల క్రితమే ఈ పద్ధతి మొదలైంది. పెద్ద బడ్జెట్ సినిమాలు వస్తే, మొదటి రోజుల్లోనే ఎక్కువ మొత్తంలో కలెక్షన్ రావాలనే ఉద్దేశంతో, టాక్ ఎలా ఉన్నా ప్రారంభ వసూళ్లు కాపాడుకునేందుకు హైక్ విధానం మొదలుపెట్టారు.

కానీ ఇప్పుడు ఈ పద్ధతి తెలుగు సినిమాలకే కాకుండా, డబ్బింగ్ సినిమాలు, అంత పెద్ద బడ్జెట్ లేని మిడిల్ రేంజ్ చిత్రాలకు కూడా వర్తిస్తున్నట్టు పరిస్థితి మారింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి సినిమా కోసం ప్రత్యేక అనుమతులు తీసుకుని టికెట్ ధరలు పెంచడం ఎక్కువగా జరుగుతోంది.

తాజాగా వార్ 2, కూలీ వంటి భారీ డబ్బింగ్ సినిమాలకు కూడా ఏపీలో టికెట్ ధరలు పెంచిన నిర్ణయం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. డబ్బింగ్ సినిమాలకు ఇంత హైక్ ఎందుకు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరోవైపు, కొంతమంది నిర్మాతలు ధరల పెంపు వల్లే ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిపోయిందని చెబుతారు. కానీ విమర్శకుల మాటల్లో, అదే నిర్మాతలు మళ్లీ టికెట్ రేట్లు పెంచడం పరిస్థితిని మరింత కష్టతరం చేస్తోందని అంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories