ఇంతకూ జగన్ ఎవరి కొంగు చాటున ఉన్నారు? 

వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ ఆస్తుల పెంపకం వివాదం ఒక కొత్త మలుపు తీసుకుంది. ఇది కేవలం వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ ఆస్తులను ఆయన లీగల్ వారసులకు పంచకుండా ఉండేందుకు జరుగుతున్న కుట్రగా భావించాల్సి వస్తోంది. వైఎస్ షర్మిల తాజాగా.. తన తండ్రి అభిమానుల కోసం విడుదల చేసిన ఒక బహిరంగ లేఖను గమనిస్తే అనేక సంగతులు మనకు అర్థం అవుతాయి.  వైఎస్ఆర్ కోరిక ప్రకారం తన బిడ్డలకు దక్కవలసిన వాటాలను ఎగ్గొట్టడానికే జగన్ ఇలాంటి దుర్మార్గాలు చేస్తున్నారని షర్మిల ఆరోపిస్తున్నారు.

షర్మిల పిల్లలు ఇద్దరికీ ఆస్తిలో సమాన వాటా పంచి ఇవ్వాలని కోరుతూ.. వైఎస్ విజయమ్మ జగన్ కు అనేక వందల లేఖలు రాశారని షర్మిల చెబుతున్నారు. కంపెనీల డివిడెండ్ లలో తనకు దక్కవలసిన వాటాలను మాత్రమే ఇచ్చి.. తనకేదో 200 కోట్లు ఉచితంగా ఇచ్చినట్లుగా జగన్ బిల్డప్ ఇస్తున్నారని షర్మిల ఆరోపిస్తున్నారు. పైగా తనకు 200 కోట్లు ఇచ్చి దానిని అప్పుగా రాయించుకున్నారని ఆమె బయట పెడుతున్నారు.

తన బహిరంగ లేఖ లో జగన్ మీద అనేక ఆరోపణలు గుప్పించిన షర్మిల.. ఆయన ఎవరి కొంగు చాటున ఉండి ఇదంతా చేస్తున్నారో తనకు తెలుసునని ఒక తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ మొత్తం కుటుంబ ఆస్తుల వివాదంలో ఉన్నది నాలుగే పాత్రలు. జగన్ తప్ప మూడు పాత్రలు స్త్రీ పాత్రలే. విజయమ్మ షర్మిల ఇద్దరూ ఒకవైపు ఉండి పోరాడుతున్నారు.. కేసులను ఎదుర్కొంటున్నారు. రెండవ జట్టులో ఉన్న ఏకైక స్త్రీ పాత్ర భారతి. జగన్ ఆమె కొంగు చాటున ఉండి ఇదంతా చేస్తున్నారని షర్మిల నర్మగర్భంగా ఆరోపిస్తున్నట్లు ఉంది.

Related Posts

Comments

spot_img

Recent Stories