పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లుపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో అలాగే అభిమానుల్లో భారీ స్థాయిలో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాను భారీ బడ్జెట్తో రూపొందిస్తూ, యాక్షన్, రొమాన్స్, హిస్టరీ అన్నీ మిక్స్ చేసిన విధంగా దర్శకులు క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ కలిసి తీస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను ఇంకాస్త పెంచేసింది.
ట్రైలర్లో ఓ దృశ్యంలో వినిపించిన పవన్ పాత్రకి సంబంధించిన సాహిత్యం అందరినీ ఆకట్టుకుంది. ప్రత్యేకంగా ఈ మాటలు వినగానే ప్రేక్షకులు, ఫ్యాన్స్ కాకుండా సంగీత ప్రేమికులు కూడా ఎమోషనల్ ఫీల్ అయ్యారు. ఈ వాక్యాలు రాసింది ఎవరో పేరున్న సాహిత్య రచయిత అనే ఊహలు మొదలయ్యాయి. కానీ నిజం తెలియగానే ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు.
ఈ పదాలన్నీ దర్శకుడు క్రిషే స్వయంగా రాసినట్టు ప్రముఖ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి తెలియజేశారు. పవన్ కోసం ప్రత్యేకంగా ఈ సాహిత్యాన్ని క్రిష్ రాయడం అభిమానులకి ఓ సర్ప్రైజ్ లా మారింది. సినిమా కథతో పాటు ఇలాంటి సాహిత్య మూమెంట్స్ కూడా ప్రేక్షకులలో ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి.
ఇప్పుడు సినిమాపై ఉన్న హైప్ చూస్తే, విడుదల తర్వాత హరిహర వీరమల్లు మరో మైలురాయిగా నిలిచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.