ఎక్స్ వేదికమీద చాలా చురుగ్గా ఉండే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి తాజా ట్వీటును చూసి.. జనం అతి ఘోరంగా నివ్వెరపోతున్నారు. ‘‘వారెవ్వా విజయసాయిరెడ్డి గారూ.. ఏం సెప్తిరి ఏం సెప్తిరీ?’’ అంటూ నవ్వుకుంటున్నారు. అసలు మీ మాటల యొక్క అర్థం మీకైనా తెలుస్తోందా అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. అందమైన వాక్యాలను ఎవరితోనైనా రాయించి.. ఎక్స్ల్ లో పెట్టినంత మాత్రాన.. తమరు సుద్దపూసలు అయిపోరు కదా అని కూడా అంటున్నారు. ట్వీట్ లో ఆయన మాటలే పరస్పర విరుద్ధంగా ఉంటున్నాయి. ఇంతకూ ఆయన ఏం చెబుతున్నారో తెలుసా..?
‘‘అవాస్తవాలు ప్రసారం చేస్తున్న కొన్ని టీవీ ఛానళ్లు, వాటి ముసుగులో చెలామణి అవుతున్న కొన్ని శక్తులకు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజాప్రతినిధిగా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. శాంతి కళింగిరిని 2020 సంవత్సరం ఏసీ ఎండోమెంట్స్ ఆఫీసర్ గా వైజాగ్ సీతమ్మధార ఆఫీస్ లో మొట్టమొదటగా మీట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు కూతురుగానే భావించాను. ఒక తండ్రిలా ఏ సహాయం కావాలన్నా చేశాను. తనకు కొడుకు పుట్టాడంటే వెళ్లి పరామర్శించాను. మా తాడేపల్లి ఇంటికి తీసుకొస్తే ఆశీర్వదించాను. ఏ పరాయి మహిళతోను అనైతిక/అక్రమ సంబంధాలు లేవు. నేను నమ్మిన దేవ దేవులు శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి లో కూడా చెప్తాను.’’ ఇవీ ఆయన మాటలు.
ఆయన మాటలను గమనిస్తే.. ఎంత చిత్రంగా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారో అర్థమవుతుంది. అవాస్తవాల విషయంలో సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదట. అంటే ఆయన ఉద్దేశం ఏమిటి? వాస్తవమైన ఆరోపణలు చేస్తే వాటికి సంజాయిషీ ఇస్తారా? ఆరోపణ వాస్తవమే అయితే గనుక.. ఇక సంజాయిషీ ఎందుకుంటుంది? వాస్తవ ఆరోపణల విషయంలో సంజాయిషీతో మాయ చేయాలనేది ఆయన సిద్ధాంతమా? అనేది ప్రజల సందేహం. అలాగే ఆయన శాంతిని కూతురులాగా చూసుకుంటున్నారు. ఆ కొత్త కూతురు తనకు ఎప్పుడు తారసపడిందో కూడా చెబుతున్నారు ఆయన!
శాంతితో ఉండే బంధం గురించి ఆమె భర్త మాట్లాడుతోంటే.. విజయసాయి చిత్రంగా ‘ఏ పరాయి మహిళతోను అనైతిక/అక్రమ సంబంధాలు లేవు’ అని అంటున్నారు. ఆ వాక్యాలు సంజాయిషీ కాక మరేమిటి? అయినా.. వేంకటేశ్వర స్వామి సన్నిధిలోనైనా ఈ మాటలు చెబుతానని అనడం ఆయన ట్వీట్ లో హైలైట్. మరి ఈ సంచలన వివాదం గురించి ఇంకా ఎందుకు ఆయన ట్వీట్లు చేస్తున్నారో అర్థం కావడం లేదు.