ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాస్ మేకర్ అట్లీ దర్శకత్వంలో ఓ భారీ సినిమా తెరకెక్కుతోంది. ఈ ప్రాజెక్ట్‌పై మొదటి నుండి మంచి క్రేజ్ ఏర్పడింది. ఫ్యాన్స్ కాదు, ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఈ కాంబినేషన్‌కి బాగా హైప్ వచ్చేసింది. ప్రస్తుతం AA26xA6 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా షూటింగ్ ముందుకెళ్తోంది.
ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ వరుసగా బయటికి వస్తున్నాయి. తాజాగా హీరోయిన్‌ను అధికారికంగా ప్రకటించారు. బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనే ఈ చిత్రంలో నాయికగా నటిస్తున్నారని మేకర్స్ ఓ స్పెషల్ వీడియోతో వెల్లడించారు. దీపిక తొలిసారి అల్లు అర్జున్‌తో స్క్రీన్ షేర్ చేయబోతుండటం అభిమానుల్లో మంచి ఆసక్తి రేపుతోంది.
అయితే, ఈ సినిమాకు సంగీతాన్ని ఎవరు అందించబోతున్నారనే అంశంపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. కొంతకాలంగా పలువురు ప్రముఖ సంగీత దర్శకుల పేర్లు వినిపిస్తున్నా, ఎవరినీ అధికారికంగా ప్రకటించలేదు. ఈ స్థాయి ప్రాజెక్ట్‌కు సంగీత దర్శకుడిగా ఎవరు ఉంటారన్న ఉత్కంఠ అభిమానుల్లో ఎక్కువగా కనిపిస్తోంది.
అన్ని రకాల ప్రేక్షకులకు నచ్చేలా, హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో ఈ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం. మ్యూజిక్ అంశంలో కూడా ఒక భారీ పేరు ఉంటుందని అంచనాలు ఉన్నాయి. మరి మేకర్స్ ఎవరిని ఖరారు చేస్తారో చూడాలి.