టాలీవుడ్‌లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘ఓదెల 2’పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. గతంలో వచ్చిన ‘ఓదెల రైల్వేస్టేషన్’ చిత్రానికి ఇది సీక్వెల్‌గా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను దర్శకుడు అశోక్ తేజ డైరెక్ట్ చేస్తుండగా.. డైరెక్టర్ సంపత్ నంది కథను అందిస్తున్నారు. ఈ సినిమాలో స్టార్ బ్యూటీ తమన్నా లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఆమె ఇందులో ఓ శివశక్తి పాత్రలో నటిస్తోంది.
ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ దక్కడంతో ఈ సినిమాకు సాలిడ్ డిజిటల్ డీల్ కుదిరింది. ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ పార్ట్‌నర్ లాక్ అయ్యింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.18 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. ఇక శాటిలైట్ రైట్స్ గురించిన చర్చలు సాగుతున్నాయట. దీంతో ఈ సినిమా ఇప్పటికే థియేట్రికల్, నాన్-థియేట్రకల్ రైట్స్‌తో మంచి లాభాలను గడిస్తుందని తెలుస్తోంది.
ఈ సినిమాలో హెబ్బా పటేల్, వశిష్ట సింహా, మురళీ శర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డి.మధు, సంపత్ నంది సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.