ఆర్టీ 76 హీరోయిన్ ఎవరంటే..!

మాస్ మహారాజా రవితేజ మరోసారి తన ఎనర్జీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. భాను బోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన ‘మాస్ జాతర’ అనే చిత్రం అక్టోబర్ 31న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సినిమా ట్రైలర్, పాటలు ఇప్పటికే మంచి హైప్‌ను క్రియేట్ చేయడంతో రవితేజ ఫ్యాన్స్ మాత్రమే కాదు, మొత్తం సినిమా ప్రేక్షకులూ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఎలా రాణిస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక రవితేజ నటిస్తున్న మరో ప్రాజెక్ట్ RT76 గురించి తాజాగా హీరోయిన్ ఆషికా రంగనాథ్ ఓ అప్‌డేట్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్పెయిన్‌లో జరుగుతోందని, అక్కడ ఓ పాటను చిత్రీకరిస్తున్నామని ఆమె సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ షెడ్యూల్ పూర్తయ్యాక స్పెయిన్ టూర్ ముగిసిందని చిత్ర బృందం తెలిపింది.

కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ RT76 సినిమాను 2026 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్రణాళిక చేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories