మెగా స్టార్‌ చిత్రాన్ని ఎవరు ప్రొడ్యూస్‌ చేస్తున్నారంటే!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తుండగా పూర్తి సోషియో ఫాంటెసీ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ వీఎఫ్ఎక్స్‌తో ఈ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా పూర్తి కాకముందే, చిరు తన నెక్స్ట్ ప్రాజెక్టులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నారు.

ఇప్పటికే దర్శకుడు అనిల్ రావిపూడి, శ్రీకాంత్ ఓదెలతో చిరంజీవి తన నెక్స్ట్ చిత్రాలకు ఓకే చెప్పాడు. ఇక మరో కమర్షియల్ డైరెక్టర్ బాబీతో కూడా చిరు ఓ సినిమాకు సైన్ చేశాడు. గతంలో బాబీ డైరెక్షన్‌లో చిరు ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇక బాబీ కూడా రీసెంట్‌గా ‘డాకు మహారాజ్’ మూవీతో అదిరిపోయే సక్సెస్ అందుకున్నాడు. దీంతో ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌పై ఆసక్తి నెలకొంది.

అయితే, ఈసారి బాబీ ఓ భారీ ప్రాజెక్ట్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ఏకంగా రూ.200 కోట్ల బడ్జెట్‌తో రూపొందించేందుకు ఆయన సిద్ధమవుతున్నాడట. ఈ సినిమా కోసం చిరు రెమ్యునరేషన్ రూ.75 కోట్లు తీసుకోనున్నట్లు చిత్ర వర్గాల టాక్‌. అయితే, ఈ సినిమాను ఎవరు ప్రొడ్యూస్ చేస్తారనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. చిరుతో బాబీ చేయబోయే ప్రాజెక్ట్‌కు ఇంత భారీ బడ్జెట్ పెట్టే నిర్మాత ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు. మరి ఈ సినిమాను పట్టాలెక్కించే నిర్మాత ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories