ఈ దీపావళి కానుకగా పండుగని ఇంకాస్త ముందే థియేటర్స్ లోకి తీసుకొచ్చిన సినిమాల్లో మోస్ట్ టాలెంటెడ్ నటుడు దుల్కర్ సల్మాన్ యాక్ట్ చేసిన ఎంటర్టైనర్ సినిమా “లక్కీ భాస్కర్” ఒకటి. ఈ సినిమాని దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా పైడ్ ప్రీమియర్స్ తోనే సాలిడ్ టాక్ ని సొంతం చేసుకొని దూసుకుపోతుంది. ఇక థియేటర్స్ లో లక్కీ భాస్కర్ బ్లాస్ట్ కచ్చితంగా కొన్నాళ్ళు కొనసాగుతుంది అని తెలిసిపోయింది. కానీ ఈ తర్వాత ఓటీటీ కోసం కూడా ఓ క్లారిటీ వచ్చింది. పోస్ట్ థియేట్రికల్ విడుదల సినిమా దిగ్గజ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి రానుంది.
దీని అఫీషియల్ స్ట్రీమింగ్ పార్ట్నర్ గా వారు లాక్ అయ్యారు. ఇక ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మించిన సంగతి తెలిసిందే.