ఇప్పుడు బాలీవుడ్‌లో హృతిక్ రోషన్, టాలీవుడ్‌లో ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ “వార్ 2″పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మల్టీస్టారర్ సినిమాపై నార్త్ నుండి సౌత్ వరకు అభిమానుల్లో ఓ రేంజ్ లో హైప్ ఏర్పడింది. మాస్, యాక్షన్ సినిమాల అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఎవరు రిలీజ్ చేయబోతున్నారు అనే విషయమై చర్చలు కొనసాగుతున్న వేళ, ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది. ఎన్టీఆర్‌కు క్లోజ్ ప్రొడ్యూసర్‌గా గుర్తింపు పొందిన సూర్యదేవర నాగవంశీ వార్ 2 తెలుగు హక్కులను సొంతం చేసుకున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అరవింద సమేత, దేవర లాంటి సినిమాలతో తారక్‌తో మంచి బాండ్ ఏర్పరచుకున్న నాగవంశీ, ఇప్పుడు వార్ 2 సినిమాను కూడా భారీగా తెలుగు ఆడియెన్స్‌కి అందించేందుకు రెడీ అవుతున్నారు.
ఈ అప్‌డేట్‌ను ఓ క్రేజీ వీడియో ద్వారా నాగవంశీ పబ్లిక్‌కి షేర్ చేయగా, అది సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. తారక్ అభిమానులు కూడా ఈ వార్తను చూసి తెగ సంబరపడిపోతున్నారు. ఇక సినిమా విషయానికి వస్తే, ఇప్పటికే షూటింగ్ దాదాపుగా పూర్తయినట్టు సమాచారం. అన్ని అంచనాల ప్రకారం ఈ సినిమా వచ్చే ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
మొత్తంగా చూసుకుంటే, ఈసారి బాలీవుడ్ హీరోతో కలిసిన తారక్ మరోసారి పాన్ ఇండియా స్థాయిలో దూసుకెళ్లనున్నాడు. నాగవంశీ తీసుకున్న ఈ కీలక నిర్ణయం వలన వార్ 2 తెలుగులో కూడా భారీ స్థాయిలో బిజినెస్ చేయబోతుందని ఇండస్ట్రీలో టాక్.