సక్సెస్ హేజ్ మెనీ ఫాదర్స్’ అని ఇంగ్లీషులో ఒక సామెత ఉంటుంది. అంటే ఎక్కడైనా ఒక ఘనకార్యం జరిగిందంటే.. ‘అది నావల్లే జరిగింది’, ‘దానికి నేనే కారణం’ అని చెప్పుకునే వాళ్లు బోలెడు మంది ఉంటారు. అదే సమయంలో.. ఒక ఫెయిల్యూర్ ఏదైనా సంభవిస్తే దానికి బాధ్యత తీసుకోవడానికి ఎవరూ ముందుకు రారు. సాధారణ వ్యవహారాల్లో అయితే అంతే.. రాజకీయాల్లో ఇలాంటి దుర్మార్గపుపోకడ మరీ ఎక్కువ. ఇప్పుదు కేంద్రప్రభుత్వం విశాఖ ఉక్కుఉద్యోగులకు గొప్ప వరాన్ని ప్రకటించింది.
పరివ్రమ నిలదొక్కుకోవడానికి ప్యాకేజీ ప్రకటించింది. ఈ పరిశ్రమను ప్రైవేటీకరణ చేయబోయేది లేదని తెగేసి చెప్పింది. కొన్నేళ్లుగా అక్కడి ఉద్యోగులు సాగించిన పోరాటానికి సార్థకత దక్కింది. అయితే ఈ విజయం తమ ఘనత అంటే తమ ఘనత అని చాటుకోవడానికి అందరూ ఉత్సాహపడుతున్నారు. అందరి సంగతి ఓకే గానీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా.. తమ పార్టీ కృషి వల్లనే వైజాగ్ ఉక్కు పరిశ్రమ గాడిలో పడుతోందని అంటున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజ్యసభ ఎంపీ అవకాశాన్ని దక్కించుకున్రన వ్యక్తి వైవీ సుబ్బారెడ్డి. జగన్ కు చిన్నాన్న అయిన సుబ్బారెడ్డి.. ఒంగోలు ఎంపీగా ఠికానా లేకుండాపోయిన తర్వాత.. తిరుమల తిరుపతి దేవస్థానాలు కేంద్రంగా రాజకీయం నడపడానికి పరిమితం అయ్యారు.
పనిలోపనిగా ఉత్తరాంధ్ర ఇన్చార్జిగా కూడా పార్టీకి సేవలందించారు. ఉత్తరాంద్ర ఇన్చార్జి అంటే మరేం కాదు.. విశాఖపట్నంలో భూములు గమనించడం కబ్జా చేయడం.. తమవి అనిపించుకోవడం అనే నిర్వచనం జగన్ కాలంలో ప్రచారంలో ఉండేది. నాలుగేళ్లు టీటీడీ ఛైర్మన్ గా ఉండి దిగిపోయిన తర్వాత.. వెంటనే రాజ్యసభ ఎంపీ స్థానం దక్కించుకున్నారు.
ఇక ఉక్కు విషయానికి వస్తే.. ఉద్యోగుల దీక్షలను ఒక్కరోజుకూడా సందర్శించకుండా, వారిని పరామర్శించకుండా.. అత్యంత మొండిగా వ్యవహరించిన నేత జగన్మోహన్ రెడ్డి. ఆయన తన హయాంలో విశాఖ ఉక్కు పరిశ్రమకు చెందిన ఆస్తులను కూడా అమ్మేయాలనుకున్నారే తప్ప.. ఉద్యోగుల డిమాండు మేరకు ప్రెవేటీకరణ ను ఆపడానికి కించిత్ ప్రయత్నం కూడా చేయలేదు.
కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ అందరేూ ఇందుకోసం శ్రమించారు. ప్రెవేటీకరణ జరగబోదని తేల్చి చెప్పిన కేంద్రమంత్రి కుమారస్వామి.. అందుకోసం పవన్ కల్యాణ్, లోకేష్ ఎంతగా శ్రమించారో ప్రత్యేకంగా ప్రస్తావించారు.
కానీ వైవీ సుబ్బారెడ్ది మాత్రం ప్రజలు అజ్ఞానులు కాదనే స్పృహలేకుండా, తన మాటలు విని జనం నవ్వుకుంటానే భయం లేకుండా.. జగన్ వల్లనే విశాఖ ఉక్కు దార్లో పడిందని అనడం చిత్రంగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.