నీ నోట్లు మన్నుబడ
నీ ఇంట్ల పీనుగెల్ల
పీ పెల్లాం ముండమొయ్య..
ఎలాంటి తిట్లు ఇవన్నీ.. ఎవరు తిట్టుకునే తిట్లు ఇవన్నీ? ఇలాంటి తిట్లు మన సమాజంలో ఎవరు తిట్టుకుంటూ ఉంటారు. మీరు ఇలాంటి తిట్లను ఎవరి నోట్లో వస్తుండగా గమనించారు. అవును.. మీరు అనుకుంటున్నది నిజమే. అచ్చంగా ఇవి ఆడవాళ్లు మాట్లాడుకునే తిట్లు మాత్రమే. పల్లెటూళ్లలో బావి పంచాయతీల దగ్గర, పొలం గొడవల దగ్గర ఆడవాళ్లు తిట్టుకునే మాటలు ఇవి. జాగ్రత్తగా గమనిస్తే.. ‘నువు బొయ్య బాయిలో పడ’ అనేది కూడా ఈ కోవకు చెందిన ఆడంగి తిట్టు అని అనుకోవాల్సిందే. తమాషా ఏంటంటే.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి చవకబారు తిట్లను ఎక్కడ నేర్చుకొచ్చారో గానీ.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఉద్దేశించి ఇలాగే తిడుతున్నారు.
నెల్లూరులో తోలించుకున్న కిరాయి జనాల సాక్షిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తీర్మానం ఏంటంటే.. జగన్ వస్తున్నారని తెలిసి వెల్లువలా వస్తున్న జనాన్ని చూసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భయపడుతున్నారట. జగన్ ప్రజాదరణ చూసి భయపడుతున్నారట. తన పాలన మీద చంద్రబాబుకే భయం పుడుతున్నదట. ఆ భయం వల్లనే తన పర్యటనల మీద ఆంక్షలు విధిస్తున్నారట. ఇంత భయపడే బదులు.. చంద్రబాబునాయుడు వెళ్లిలో ఏదైనా బాయిలో దూకాలని జగన్మోహన్ రెడ్డి శాపనార్థాలు పెట్టారు.
ఒక రాజకీయ నాయకుడు.. తన రాజకీయ ప్రత్యర్థిని నిర్మాణాత్మకంగా విమర్శించడం వేరు. విధానాల పరంగా తూర్పారపట్టడం వేరు. విమర్శ కూడా రాష్ట్రానికి, ప్రజలకు ఉపయోగపడేలా జాగ్రత్త తీసుకోవడం వేరు. అవేమీ కాకుండా.. చంద్రబాబునాయుడు బాయిలో పడి చావాలి.. అని శాపనార్థాలు పెట్టడం అనేది ఆడంగి తరహా తిట్టే వ్యవహారం అని నెల్లూరు జనం నవ్వుకుంటున్నారు.
గతంలో ఓ సందర్భంలో కొడాలి నాని, వల్లభనేని వంశీ చాలా అందగాళ్లు.. వాళ్లు అందగాళ్లు గనుక.. వారి అందాన్ని చూసి చంద్రబాబునాయుడు, లోకేష్ అసూయపడి వారిని వేధిస్తున్నారు.. అని ప్రవచించిన మహానుభావుడు జగన్. ఆయన ఇలాంటి ఆడంగి తిట్లు నేర్చుకోవడంలో వింతేముందిలే అని పలువురు అనుకుంటున్నారు.
వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఒక మహిళా ఎమ్మెల్యేను బూతులు తిట్టిన వ్యక్తిని మందలించలేదు. తన పార్టీనుంచి సస్పెండ్ చేయలేదు. వివరణ అడగలేదు. అలా చేసి తమ పార్టీ మర్యాదను, గౌరవాన్ని పెంచుకునే ప్రయత్నం చేయలేదు. చేయకపోగా.. తగుదునమ్మా అంటూ.. సదరు ప్రసన్నకుమార్ రెడ్డికేదో అన్యాయం జరిగిపోయినట్టుగా వారి ఇంటికి పరామర్శకు వెళ్లి నానా రభస చ చేయడం ఆయన దుర్మార్గమైన బుద్ధికి నిదర్శనం అని పలువురు అంటున్నారు